హైహీల్స్ తో అవస్థలు

Durga
            హైహీల్స్ అందునా సాయిటెడ్ హీల్స్ వాడేవారు వెంటనే అలవాటుకు స్వస్తి పలకాలి. ఎందుకంటే ఇలా హైహీల్స్ వాడేవారిలో అధికశాతం అస్థియో అర్థరైటిస్ తో బాధపడే అవకాశం వుందని డాక్టర్లు అంటున్నారు.       పురుషులతో పోలిస్తే స్త్రీలు అందునా ఎత్తుమడమల చెప్పులు ధరించేవారు ఎక్కువగా ఈ వ్యాధికి లోనవుతున్నారట. ఈ విషయం మీద హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు అధ్యయనం జరిపారు. ఇరవై నుంచి నలభై ఏళ్ల వయసున్న స్త్రీలను ముందుగా కాళ్లకు చెప్పులు లేకుండా నడవమన్నారు.       ఈ సమయంలో ప్రత్యేకమైన కెమెరాలతో రికార్డు చేశారు. ఇలా ఉత్త కాళ్ళతో (చెప్పులు లేకుండా) నడుస్తున్నప్పుడు మోకాళ్ళు ఎంత ఒత్తిడికి లోనవున్నాయో గమనించారు. ఆ తర్వాత రెండు అంగుళాల కన్నా ఎత్తు ఉన్న హైహీల్స్ ధరించినడవమని చెప్పారు.        మళ్ళీ మోకాళ్ల మీద ఒత్తిడి ఏవిధంగా ఉందనేది రికార్డు చేశారు. రెండు అంగుళాల కన్నా ఎత్తు వున్న చెప్పులు ధరించడం వల్ల మోకాళ్లపై ఇరవైమూడు శాతం అధిక ఒత్తిడి పడుతుందట, దీనివలన అస్టియో అర్థరైటిస్ వచ్చే అవకాశం వుంది.        అందువలన హైహీల్స్ వాడకం పక్కన పెట్టేయండి. ఎప్పడైనా ప్రత్యేక సందర్భాలకు మాత్రమే పరిమితం చేయండి. అప్పడు కూడా రెండు అంగుళాలకు మించి ఎత్తు చెప్పులు ధరించకుండా జాగ్రత్త పడండి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: