వీటిని తింటే షుగర్ తగ్గి బలంగా అవుతారు?

Purushottham Vinay
మన ప్రకృతి మనకు చాలా రకాల ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ ను ఇచ్చింది.ఇక ప్రకృతి అందించిన డ్రై ఫ్రూట్స్ లో అత్యంత విలువైన ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఈ డ్రై ఫ్రూట్ పేరు మకాడేమియా. ఇది మనకు పెద్ద పెద్ద డ్రై ఫ్రూట్ షాపుల్లో మాత్రమే దొరుకుతుంది. దీని గురించి దాదాపు మనలో చాలా మందికి కూడా తెలిసి ఉండదు. ఇది చాలా కాస్ట్ లీ. ఈ మకాడేమియా డ్రై ఫ్రూట్ కిలో ఏకంగా నాలుగు వేల రూపాయలు ఉంటుంది. ఈ డ్రై ఫ్రూట్ ఎక్కువగా చైనా దేశంలో పండుతుంది. దీని గింజలు అతి మధురంగా, అతి రుచిగా ఉంటాయి. ఈ గింజలపై పెంకు కూడా చాలా గట్టిగా ఉంటుంది. పెంకు తీసేసిన గింజలు, పెంకుతో ఉండే గింజలు ఇలా రెండు రకాలుగా మనకు దొరుకుతాయి. మకాడేమియా గింజలను తినడం వల్ల మనకు కలిగే లాభాలేమిటో పూర్తిగా తెలుసుకుందాం.మీరు ఈ గింజలను తినడం వల్ల 713 క్యాలరీల శక్తి లభిస్తుంది. బాదంపప్పు, జీడిపప్పు ఇంకా వాల్ నట్స్ కంటే ఈ గింజలు అధిక క్యాలరీల శక్తిని కలిగి ఉంటాయి. అలాగే 66 గ్రాముల ఫ్యాట్ ను కూడా కలిగి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఈజీగా తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఈ గింజల్లో 8 గ్రాముల ప్రోటీన్ కూడా ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ 13 గ్రాముల మోతాదులో ఉంటాయి. డయాబెటిస్ సమస్యతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


అలాగే షుగర్ పెరగకుండా ఉండడంతో పాటు శరీరానికి కావల్సిన శక్తి కూడా లభిస్తుంది. ఇంకా అలాగే ఈ గింజల్లో 9 గ్రాముల ఫైబర్ కూడా ఉంటుంది.వీటిని కొనుగోలు చేసే స్థితిలో ఉన్న వారు వీటిని ఈజీగా తీసుకోవచ్చు. ఈ గింజలను నానబెట్టాల్సిన పని కూడా ఉండదు.వీటిని తాజాగా తింటేనే చాలా రుచిగా ఉంటాయి. అలాగే మొలకెత్తిన విత్తనాలతో కలిపి కూడా తీసుకోవచ్చు. సాయంత్రం సమయాల్లో వీటిని స్నాక్స్ గా కూడా తినవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగాలనుకునే వారు, గర్భిణీ స్త్రీలు వీటిని తీసుకోవడం వల్ల చాలా ఈజీగా బరువు పెరగవచ్చు.అలాగే జీర్ణ సమస్యలు ఉన్న వారు వీటిని నానబెట్టి తీసుకోవచ్చు. ఈ గింజలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది. శరీరంలోజీవక్రియల రేటు కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఈ మకాడేమియా గింజలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుందని ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: