హార్మోన్ల సమస్యతో బాధపడుతున్నారా..?

Divya
ఈ మధ్యకాలంలో చాలామంది హార్మోన్ ఇంబ్యలన్స్ వల్ల అనేక సమస్యలతో బాధపడుతూన్నారు. ముఖ్యంగా మహిళలలో రుతుక్రమణ సమయంలో అధికంగా రక్తస్రావం కావడం,లేకుంటే అసలే రక్తస్రావం కాకుండా ఉండడం,ఊబకాయం అధిక బరువు,ఆయాసం,మెదడు పనితీరులో మార్పులు,స్త్రీ లలో ఓవరీస్ లో నీటి బుడగలు రావడం మరియు మగవారిలో ఇస్ట్రోజన్ లెవెల్స్ తగ్గి,శుక్రకణాల సంఖ్య తగ్గడం వంటి ఎన్నో సమస్యలు కలుగుతాయి.ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఎన్నో రకాల ఇంగ్లిష్ మందులు వాడినా ప్రయోజనం లేకపోగా అనేక దుస్ప్రభావాలకు లోనవుతున్నారు.కానీ హార్మోనల్ సమస్యలను తగ్గించుకోవడానికి కొన్ని రకాల డైట్ లు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాంటి డైట్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
మన శరీరంలో హార్మోనల్ గ్రందులన్నీ, సరిగా హార్మోన్స్ విడుదల కావడానికి ప్రకృతి ప్రసాదించిన ఆహారలే చాలా బాగా ఉపయోగపడతాయి.అలాంటి ఆహారాలు ఏ సమయంలో తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఉదయం..
మన శరీరంలోని హార్మోన్స్ ని ప్రోటీన్ కలిగిన ఆహారం చాలాబాగా ప్రభావితం చేస్తుంది.కావున ఉదయాన్నే వుండికించిన టి, కాఫీ బదులుగా వెజిటేబుల్ జ్యూస్ వంటివి తీసుకోవాలి, ఇందులో వున్న హై పైబర్, ప్రోటీన్స్ మరియు తక్కువ కార్బోహైడ్రైట్స్ శరీరానికి అంది హార్మోనల్ గ్రందులు హార్మోన్స్ ని సక్రమంగా విడుదల చేస్తాయి.
మధ్యాహ్నం..
మధ్యాహ్న భోజన సమయంలో హై ప్రోటీన్ కలిగి, తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ ని తీసుకోవాలి. ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ వున్న చేపలు ఎక్కువగా మన రోజువారీ డైట్ లో చేర్చుకోవాలి.దీనితో తక్కువగా తిన్నా, ఎక్కువగా తిన్న భావన కలిగి, అధిక బరువు పెరగకుండా వుంటారు.
సాయంత్రం భోజనం..

సాయంత్రం భోజనంగా వుండికించిన ఆహారాలు లేకుండా, పుచ్చగింజలు, పొద్దుతిరుగుడు గింజలు, నాలుగు ఐదు ఖర్జూరాలు,రెండు లేదా మూడు ఏవైనా సీజనల్ ఫ్రూట్స్ తీసుకుంటుండాలి.ఇలా తగిన ఆహారాలు తీసుకోవడం వల్ల శరీర జీవక్రియరేటు పెరిగి,హార్మోనల్ గ్రందులు హార్మోన్స్ ని సక్రమంగా విడుదల చేస్తాయి. వీటితో పాటు ఒక గంట పాటు నడక, వ్యాయామం చేయడం చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: