మూడ్ బాగుండాలంటే ఇవి తినండి?

Purushottham Vinay
వేడి ఎక్కువగా వున్నప్పుడు సాధారణంగా అందరికీ తరచుగా చెమటలు పడుతాయి.కొంతమందికి ఆందోళన కలిగినప్పుడు చెమటలు పడతాయి.దీనివల్ల చాలా చికాకుగా ఉంటుంది.దీనివల్ల మన మూడ్ పాడవుతుంది.మన మూడ్ బాగుంటేనే మనం చాలా హ్యాపీగా ఇంకా యాక్టీవ్ గా ఉంటాము. రోజంతా యాక్టీవ్ గా పని చేసుకోగల్గుతాము. కాబట్టి ఖచ్చితంగా మనం మంచి మూడ్ లో ఉండాలి.అందుకే ఈ పరిస్థితిలో మీరు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలి.మన సరిగ్గా లేనప్పుడు అసలు ఏది కూడా తినాలని అనిపించదు. ఎందుకంటే శరీరంలో సెరోటోనిన్ అనే మూలకం లోపం ఉంటుంది. ఇక ఇది ఒక రకమైన న్యూరోట్రాన్స్మిటర్. దీని వల్ల మూడ్ స్వింగ్స్ అనేవి ఆగిపోతాయి. శరీరంలో సెరోటోనిన్ లోపం రాకుండా ఉండాలంటే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ ఖచ్చితంగా మనం తినే ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. శరీరంలో సెరోటోనిన్ ఉత్పత్తి పెరిగినప్పుడు మానసిక స్థితి అనేది సరిగ్గా ఉంటుంది. ఇందుకోసం ఆహారంలో మీరు అరటిపండ్లను చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ట్రిప్టోఫాన్ పెద్ద మొత్తంలో లభిస్తుంది. 


అందుకే అరటిపండు తినడం వల్ల మూడ్ చాలా బాగుంటుంది. అలాగే మీకు నిద్ర కూడా బాగా పడుతుంది. ఇది కాకుండా ఆహారంలో బాదంను కూడా మీరు చేర్చుకోవచ్చు. వీటిలో ఫోలేట్, మెగ్నీషియం అనేవి చాలా పుష్కలంగా లభిస్తాయి.మెగ్నీషియం సెరోటోనిన్ ఉత్పత్తిని పెంచడంలో చాలా బాగా సహాయపడుతుంది.ఇంకా అలాగే ఇది కాకుండా పైనాపిల్‌లో ట్రిప్టోఫాన్, బ్రోమెలిన్ అనే ప్రోటీన్ కూడా ఉంటుంది. ఈ ప్రొటీన్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా సోయా ఉత్పత్తులను తీసుకోవడం వల్ల కూడా మూడ్ స్వింగ్‌లను చాలా ఈజీగా నివారించవచ్చు. ఎందుకంటే ఇందులో ట్రిప్టోఫాన్ అనేది మంచి పరిమాణంలో ఉంటుంది. అయితే ఇవి తీసుకునే ముందు ఖచ్చితంగా వైద్యుడి సలహా తీసుకోవాలి. ఇలాంటి వాటి కోసం ఖచ్చితంగా వైద్యుని తీసుకోవడం మరిచిపోవద్దనే విషయం గుర్తుంచుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: