షుగర్, కొలెస్ట్రాల్ ని మాయం చేసే కూరగాయ ఇదే?

Purushottham Vinay
షుగర్, కొలెస్ట్రాల్ ని మాయం చేసే కూరగాయ ఇదే ?

ఈ రోజుల్లో చాలా మంది కూడా షుగర్, కొలెస్ట్రాల్ సమస్యలతో ఎంతగానో బాధపడుతున్నారు. వాటికి మందులతో కాకుండా మనం తీసుకునే హెల్తీ డైట్ తో కూడా ఈజీగా చెక్ పెట్టొచ్చు. ఈ బెండకాయ అనేది ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇక అంతేకాదు ఆకలిని కూడా చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఇంకా అలాగే అధిక క్యాలరీలను తగ్గించడంతోపాటు జీర్ణక్రియలో బాగా సహాయపడుతుంది. ఈ బెండకాయలో చాలా ఎక్కువ మొత్తంలో నీటిలో కరిగే, కరగని ఫైబర్‌లు ఉంటాయి. అందుకే జీర్ణం కావడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. బెండకాయలో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, లినోలెయిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్ ఇంకా అలాగే ఫోలేట్ వంటి ఇతర పోషకాలు కూడా చాలా ఫుష్కలంగా ఉన్నాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను చాలా ఈజీగా కంట్రోల్ చేస్తాయి. 


కాబట్టి బ్లడ్ షుగర్ అనేది ఎప్పుడూ కూడా పెరకుండా, తగ్గకుండా స్థిరంగా ఉంటుంది. ఇక ఒక కప్పు బెండకాయ కూరలో దాదాపు 37మైక్రోగ్రాముల ఫొలేట్ అనేది ఉంటుంది.అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం తినే ఆహారం యాంటీ ఆక్సిడెంట్లు ఇంకా ఫైబర్ అధికంగా ఉండేలా తినాలి. అందువల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బెండకాయలో ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు ఇందులో ఉండే పెక్టిన్ అనే ఎంజైమ్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ ను కూడా ఈజీగా పెంచుతుంది. అందువల్ల గుండె చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంతేగాక ఇది కణాలకు ఆక్సీకరణ నష్టాన్ని నివరిస్తుంది కాబట్టి క్యాన్సర్ ప్రమాదం ని కూడా తగ్గిస్తుంది.షుగర్, కొలెస్ట్రాల్ ని మాయం చేసే కూరగాయ ఇదే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: