బ్లడ్ షుగర్ ఉన్నవారు ఇవి ఖచ్చితంగా తినండి?

Purushottham Vinay
సమయాపాలన లేకుండా తీసుకునే ఆహారం  మన ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా హనికరంగా ఉంటుంది. మనం పాటించే ఆహారపు అలవాట్ల కారణంగానే చాలామంది మధుమేహం, హార్మోన్ల అసమతుల్యత, ధూమపానం, శారీరక శ్రమ తగ్గడం ఇంకా అలాగే ఊబకాయం వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు సంక్రమిస్తాయి.కాబట్టి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలనేవి హెచ్చుతగ్గులకు లోనవుతాయి.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రక్తంలో అధిక చక్కెర.. గుండెపోటు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని ఈజీగా పెంచుతుంది.అయితే రోజువారీ జీవనశైలి ఇంకా ఆహారంలో మార్పు చేయడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని ఈజీగా కంట్రోల్ చేయవచ్చు. రక్తంలో అధిక చక్కెర ఉన్న రోగులలో కొన్ని ఆహారాలను పరగడుపున తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అలాగే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా మనం పొందవచ్చు. మరి పరకడుపున తీసుకొవలసిన ఆ ఆహారాలేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..ఇక పచ్చి మిరపలో పెద్ద మొత్తంలో క్యాప్సైసిన్ అనేది ఉంటుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో ఎంతగానో సహాయపడుతుంది. 


అందువల్ల ప్రతి రోజూ కూడా ఖాళీ కడుపుతో 30 గ్రాముల పచ్చిమిర్చిని తినండి.ఇది ఖచ్చితంగా షుగర్ ని కంట్రోల్ చేస్తుంది.ఇంకా అలాగే మెంతికూరలో విటమిన్ సి, ఎ, బి, పొటాషియం, కాల్షియం ఇంకా మెగ్నీషియం అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫాస్పోరిక్ యాసిడ్, ప్రోటీన్ ఇంకా ఫైబర్ కూడా ఉంటాయి. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా రకాలుగా మేలు చేస్తుంది.ఇక మీరు రాత్రిపూట ఒక గ్లాసులో టీస్పూన్ మెంతి గింజలను నానబెట్టి ఉదయం పూట ఈ నీరు తాగితే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.ఇంకా అలాగే రక్తంలో చక్కెరను నియంత్రించడానికి అల్లం కూడా చాలా ముఖ్యం.ఇందులోని పోషకాలు ఇన్సులిన్ పెంచడానికి సహాయపడతాయి. షుగర్ రోగులు ఖాళీ కడుపుతో అల్లం నీరు లేదా అల్లం టీని తీసుకోవాలి. అల్లం పొడి లేదా పచ్చి అల్లం తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: