కంటిచూపు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చేయాల్సిందే..!!

Divya
ఈ మధ్య కాలంలో చాలా మంది కంటి చూపు తగ్గి చాలా ఇబ్బంది పడుతున్నారు. చిన్న పిల్లలు సైతం కళ్ల జోడు లేనిదే చూడలేక పోతున్నారు. దీనికి కారణం పోషకాహర లోపం, టీవీ, మొబైల్ ఎక్కువగా చూడటం, వంశపారంపర్యం, అని చెప్పవచ్చు.అయితే మనం మన జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల కంటి చూపును మెరుగుపర్చుకోవచ్చు. అంతే కాక మనం కూడా ఆరోగ్యం ఉండవచ్చు.మనం జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

బీడీ, సిగరెట్ లకు దూరంగా ఉండటం..
ఈ బీడీ, సిగరెట్లు కాల్చడం వల్ల శరీరంలోని అవయవాలు తీవ్ర అనారోగ్యానికి గురయే అవకాశం వుంటుంది.దీని వల్ల రోగనిరోధక వ్యవస్థను తీవ్రంగా అనారోగ్యానికి గురవుతుంది. సిగరెట్ పొగలోని ఆక్సిడెంట్ లు  వల్ల AMD, కంటి నుంచి నీరు కారడం,, కళ్ళు ఎరుపేక్కడం వంటి ఇతర కంటి వ్యాధులు వస్తాయి. కావున వీటికి దూరంగా ఉండటం మంచిది.
డిజిటల్ డిటాక్స్ చేయడం..
డిజిటల్ డిటాక్స్ అంటే అనవసర సమయాల్లో స్క్రీన్ సమయాన్ని తగ్గించడం.ఫోన్లు మరియు కంప్యూటర్లను ఎక్కువగా వాడటం వల్ల స్క్రీన్లోని నీలిరంగు కాంతికి  కళ్లను తీవ్ర దెబ్బతిస్తుంది.ఇది పొడి కళ్ళు మరియు అలసట నుండి మయోపియా మరియు AMD వరకు అనేక వ్యాధులకు గురిచేస్తుంది. మీ కళ్లను పొడిబారకుండా చూసుకోవాలి.
పోషకాహారం తినడం..
కళ్ళు సురక్షతంగా ఉండటానికి  ఆరోగ్యకరమైన ఆహారం  చాలా అవసరం.జంక్ పుడ్ బదులుగా కూరగాయలు మరియు పండ్లు తినాలి. మరియు 'విటమిన్ ఏ 'కలిగిన చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు, నారింజ, క్యారెట్లు వంటి ఆహార పదార్థాలు మీ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
కంటి పరీక్షలు నిర్వహించడం..
కళ్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. వారు చెప్పిన సూచనలను పాటిస్తూ ఉంటే కళ్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
కావున ప్రతి ఒక్కరు తమ జీవన విధానాలను మార్చుకొని , పోషకాహారాన్ని తీసుకోవడం వల్ల, కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: