ఈ సమస్యలతో బాధపడేవారు ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే అంతే సంగతులు..!

Divya
ఈ మధ్యకాలంలో డైట్ పేరుతో కార్బోహైడ్రేట్స్ తక్కువగాను, ప్రోటీన్స్ ఎక్కువగాను తీసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు.సాధారణంగా మనిషికి ప్రోటీన్, బాడీ బిల్డింగ్ కోసము, కండరాల పనితీరు మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. కానీ ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల కూడా చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.కొన్ని రోగాలతో బాధపడేవారు ప్రోటీన్ ఎక్కువగా తీసుకుంటే వాళ్ళ సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోకూడదో ఇప్పుడు చూద్దాం..
 మన శరీరము కూరగాయల నుంచి వచ్చే ప్రోటీన్ ని ఎక్కువగా అబ్జర్బ్ చేసుకోగలదు కానీ, మాంసాహారపు నుంచి వచ్చే ప్రోటీన్ ని అంతగా శోషణ చేసుకోలేదు. కావున ప్రతి ఒక్కరు శాఖాహారం నుంచి ప్రోటీన్ పొందడమే ఉత్తమం అని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.
 గుండెసంబంధిత రోగాలతో బాధపడేవారు..
 ప్రోటీన్ సాధారణంగా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ అధికంగా తీసుకోవడం వల్ల గుండె చుట్టూ కండరాలు పెరిగి, రక్త సరఫరా సక్రమంగా జరగక, గుండె సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
 మధుమేహంతో బాధపడేవారు..
 షుగర్ తో  బాధపడేవారు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల, రక్తంలోని గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంటుంది.
 కిడ్నీ సమస్యలతో బాధపడేవారు..
 ప్రోటీన్ సాధారణంగా జీర్ణమైన తర్వాత, వేస్ట్ అంతా యూరిన్ గా మారుతుంది. కానీ ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల, యూరిన్ అధికంగా ఉత్పత్తి అయి, స్పటికాలుగా మారి, కీళ్ల జాయింట్లలో నిల్వ ఉంటుంది. అది గౌట్ సమస్యకు దారితీస్తుంది.అంతేకాక శరీరంలోని వేస్టేజ్ ను కిడ్నీలు వడకట్టి బయటికి పంపుతుంటాయి. అధిక ప్రోటీన్ వల్ల యూరిన్ అధికంగా ఉత్పత్తి అయి, కిడ్నీలకు భారంగా మారుతుంది. అది క్రమంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి దోహదం చేస్తుంది.
 కావున ప్రతిఒక్కరూ ప్రోటీన్ ని మోతాదులో తీసుకోవడమే, ఆరోగ్యానికి మంచిది. ప్రోటీన్ ని పొందడానికి ఒకే రకమైన పప్పుదినుసులు వాడకుండా,అన్ని రకాల పప్పు దినుసులు వాడటం వల్ల శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: