సుఖంగా నిద్ర పట్టాలంటే..?

Purushottham Vinay
చాలా మంది కూడా నిద్రలేమి ఇంకా రాత్రిళ్లు నిద్ర పట్టకపోవడం వంటి నిద్ర సంబంధిత సమస్యలతో చాలా రకాలుగా  బాధపడుతున్నారు. ఉద్యోగ జీవితంలో బిజీ కావడం కూడా ఇందుకు ప్రధాన కారణం. నిజానికి మన ఆరోగ్యానికి నిద్ర ఎంతో ముఖ్యం. రాత్రి వేళ ఎంత హాయిగా నిద్రపోతే మరుసటి రోజు అంత ఉత్సాహాంగా ఇంకా చురుకుగా ఉంటాం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాత్రి సమయంలో చాలా మంది కూడా నిద్రపోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. అయితే సరిగ్గా నిద్ర పట్టకపోవడానికి లైఫ్ స్టైల్ లో మార్పులు కూడా ఒక కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సరైన నిద్రలేకపోవడం వల్ల శరీరం పనితీరు బాగా దెబ్బతింటుందని చెబుతున్నారు. ప్రతి మనిషికి రాత్రిళ్లు 7 నుంచి 8 గంటల నిద్ర అనేది చాలా అవసరం. ఈ నేపథ్యంలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా సుఖ నిద్ర కోసం కొన్ని రకాల టిప్స్ పాటిస్తే సరిపోతుందని పేర్కొంటున్నారు. వారు తెలిపిన టిప్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..


సాయంత్రం పూట ఎక్కువగా ఎక్సర్ సైజులు చేయకుండా.. యోగా ఇంకా తేలికపాటి వ్యాయామాలు చేస్తే శారీరక, మానసిక ఆరోగ్యానికి ఖచ్చితంగా చాలా మేలు కలుగుతుంది. ఇంకా అలాగే హాయిగా నిద్ర పోయేందుకు ఇవి బాగా సహాయ పడతాయి.గ్యాస్ట్రిక్ సమస్యలు రాకుండా నిద్ర పోయేందుకు కనీసం రెండు లేదా మూడు గంటల ముందు రాత్రి భోజనం చేయాలి. సాయంత్రం సమయంలో కెఫిన్ ఇంకా ఆల్కహాల్ వినియోగాన్ని ఖచ్చితంగా తగ్గించాలి. నిద్ర పోయే ముందు ఆహారాన్ని తినడం వల్ల బరువు పెరిగే అవకాశం ఈజీగా ఉంది. అలాగే అర్థరాత్రి నిద్రాభంగం కలిగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి భోజనం విషయంలో సమయపాలన చాలా ముఖ్యం..ప్రతి రోజు కూడా నిద్ర పోయేందుకు ఒక సమయం పెట్టుకోవాలి. ఇక పడుకునే ముందు కొద్దిసేపు వాకింగ్ చేసినా లేదా బుక్స్ చదివినా చాలా మంచిది. అలాగే చర్మ సంరక్షణ కోసం రాత్రి పూట చల్లని నీటితో ముఖం కడుక్కుని పడుకోవడం వల్ల చాలా హాయిగా నిద్రపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: