ఎముకలు, కీళ్ళ అరుగుదల సమస్యని తగ్గించే ఫుడ్స్?

Purushottham Vinay
ఎముకలు, కీళ్ళ అరుగుదల సమస్యకి కోడి గుడ్లని తీసుకోండి. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, కాల్షియం, విటమిన్ డి వంటి వివిధ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ కూడా మన ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇక ఆ గుడ్డులో తెల్లగా ఉండే పదార్థమే కాకుండా.. మొత్తం గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిది.అలాగే సాధారణంగా నట్స్‌లో వివిధ రకాల పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ప్రోటీన్స్, కాల్షియం ఎక్కువుగా ఉండే వాటిలో బాదంపప్పు కూడా ఒకటి. ఇవి మన ఎముకలు, కండరాలు ఇంకా అలాగే కీళ్ల యొక్క ఆరోగ్యాన్ని బాగా మెరుగుపరుస్తాయి.జిడ్డుగల చేపలు.. ఇక వీటినే ఫ్యాటీ ఫిష్ అంటారు. సాల్మన్, ట్యూనా, హిల్సా వంటి కొవ్వు చేపలలో కాల్షియం ఇంకా విటమిన్ డి మొదలైన పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మన ఎముకల ఆరోగ్యాన్ని చాలా బాగా మెరుగుపరుస్తాయి. కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా చాలా పుష్కలంగా ఉంటాయి.ఇంకా అలాగే పాల ఉత్పత్తుల్లో ప్రోటీన్, కాల్షియం వంటి పోషకాలుంటాయి.


పాలు ఇంకా పెరుగు వంటి పాల ఉత్పత్తులు శరీరంలోని ఎముకులు ధృడంగా ఉండేందుకు చాలా బాగా సహాయపడతాయి. పాల ఉత్పత్తులను రోజువారి ఆహారంతో తీసుకోవడం చాలా మేలు.ఇంకా అలాగే గ్రీన్ లీఫ్ వెబిటేబుల్స్ గా పిలిచే క్రూసిఫెరస్ కూరగాయల్లో పోషకాలు చాలా ఎక్కువుగా ఉంటాయి.వీటిలో పాలకూర, బచ్చలికూర, క్యాబేజీ, బ్రోకలీ ఇంకా అలాగే కాలీఫ్లవర్ వంటి కూరగాయలను ఆహారంతో తీసుకోవడం ద్వారా మన ఎముకలు ఇంకా కండరాలు బలంగా ఉంటాయి.శాఖాహరులు కాల్షియం ఉన్న పదార్థాలను తీసుకోవాలంటే సోయా బీన్స్ తినండి.బీన్ పెరుగు చాలా మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. ఇది సహజంగా గ్లూటెన్ రహితంగా ఉంటుంది. ఇతర సోయా బీన్స్ పదార్థాలైన టేంపే, సోయా పాలు వంటి వాటిలో కాల్షియం ఇంకా అలాగే విటమిన్ D ఎక్కువుగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: