కంటి ఆరోగ్యం కోసం ఈ టిప్స్ పాటించండి?

Purushottham Vinay
కంటి చూపును కాపాడుకోవడానికి తమలు పాకులు తినడం చాలా అవసరం. అలాగే నిద్రలేమి కారణంగా చాలా మంది ఇబ్బందులు పడతారు. వికారంగా అనిపించడం, మలబద్ధకం, అసిడిటీ వంటివి కలుగుతాయి. నిద్ర సరిగా పట్టకపోవడం వల్ల కంటి పనితీరు కూడా దెబ్బతింటుంది. నిద్ర బాగా పట్టాలన్నా, కంటి చూపు మెరుగుపడాలన్నా రోజుకు రెండు ఆకులు తొడిమను తీసేసి నమిలి తినాలి. ఒట్టి తమలపాకు తిన్నా మంచిదే లేదా, పచ్చ కర్పూరం అతి తక్కువ పరిమాణంలో కలుపుకుని తిన్నా మంచిదే. తమలపాకుకు కాస్త వెన్న రాసి పైన చిటికెడులో సగం పచ్చకర్పూరం పొడి వేసి తింటే ఇంకా ఎన్నో లాభాలు కలుగుతాయి.రెండు పలుకుల పచ్చకర్పూరం, కొంచెం మంచి గంధాన్ని కానీ వెన్నను కానీ కలిపి తమలపాకులో వేసుకుని నమిలి రసాన్ని మింగితే కంటికి సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అంతేకాకుండా శరీరంలోని వేడి కూడా తగ్గుతుంది. పచ్చకర్పూరం తీసుకోవడం వల్ల కళ్లు మంటలు, కళ్లు ఎరుపెక్కడం, కళ్లలో నుండి నీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.


ఈ చిట్కాను పాటించడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు. తమలపాకును, పచ్చకర్పూరాన్ని కలిపి తినడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న వేడి తగ్గుతుంది. అంతేకాకుండా కళ్లు ఎర్రబడడం, కళ్ల మంటలు, కళ్ల దురదలు, కళ్ల నుండి నీళ్లు కారడం వంటి కంటి సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. తలనొప్పితో బాధపడే వారు కూడా ఈ చిట్కాను పాటించడం వల్ల సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.రోజుకు రెండు తమలపాకులు నమలడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. వీటిల్లో కాల్షియం, ఇనుము, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది ఆకలిని పెంచుతుంది.ఆహారం అరిగేలా చేస్తుంది. తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలతో బాధపడేవారికి తమలపాకు తినడం వల్ల లాభం కలుగుతుంది. కడుపుబ్బరంగా అనిపించినప్పుడు రెండు తమలపాకులు నమిలేసి కాస్త పాలు తాగితే మంచిది. తమలపాకు తినడం జీర్ణ రసాలు ఉత్పత్తి అవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: