కారం ఎక్కువ తింటే కలిగే నష్టాలివే?

Purushottham Vinay
చాలా మందికి కూడా రెడ్ చిల్లీ పౌడర్ ఎక్కువగా తినే అలవాటు ఉంటుంది. లవణం తక్కువగా ఉందని, రేపటి నుంచి ఎక్కువ ఉప్పు వేయాలని కూడా రుచికరమైన భోజన ప్రియులు సూచనలు ఇస్తుంటారు. కానీ, ఇలాంటి అలవాట్లు శరీరానికి చాలా హాని కలిగిస్తుంది. కొందరు ఆహారంలో కారం అధికంగా తీసుకుంటారు. మరికొందరు తగినంత మోతాదులో తింటారు. డాక్టర్లు మాత్రం అధిక కారం తినకూడదని చెబుతుంటారు.. దానివల్ల ఉప్పు సైతం ఎక్కువ తినాల్సి వస్తుందని సూచిస్తారు. కొందరు బరువు తగ్గేందుకు కారం పొడి ఎక్కువగా తింటారట.. కానీ, కారంపొడితో ఆరోగ్యానికి హాని ఎక్కువగా ఉందంటున్నారు వైద్యులు. తగినంత మోతాదులో తింటే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. మసాలా, ఎర్ర మిరపకాయ ఏ వంటకానికి అయినా రుచిని జోడిస్తుంది. పప్పుతో సహా అనేక వంటకాలు అది లేకుండా అసంపూర్ణంగా కనిపిస్తాయి. కానీ ఎక్కువ మిర్చి పౌడర్ వాడడం లేదా మసాలాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులకు దారి తీస్తుంది.


సాధారణంగా వైద్యులు ఎర్ర మిరపకాయలను తక్కువగా తినమని సూచిస్తారు.ఎందుకంటే కడుపులో పుండు వస్తుందనే భయం ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా కారం పొడి చాలా ప్రమాదకరం. దీని కణాలు కడుపు, ప్రేగులకు అంటుకుంటాయి. క్రమంగా ఇది అల్సర్లకు కారణమవుతుంది.ఎర్ర మిరపకాయలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. ఇది కడుపులో ఎసిడిటీని కలిగిస్తుంది. అలాగే కొంతమంది తరచుగా గుండెల్లో మంట అంటుంటారు. మీరు అలాంటి సమస్యతో బాధపడుతుంటే వెంటనే ఎర్ర మిరపకాయలు తీసుకోవడం మానేయండి.ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తీసుకోవడం వల్ల డయేరియా అటాక్‌లు వచ్చే అవకాశం ఉంది. కారంపొడి అధిక వినియోగం కడుపుకు మంచిది కాదు. ఇది పరిమిత పరిమాణంలో తినాలి. సాధారణంగా మసాలా దినుసులు డీప్ ఫ్రై చేసినప్పుడు అవి పొట్ట లోపలి భాగంలో అతుక్కుని సమస్యలను కలిగిస్తాయి.కాబట్టి తగినంత మాత్రమే కారం వాడండి. ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: