ఇలా నీళ్లు తాగితే అందం, సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం?

Purushottham Vinay
ఒకటిన్నర కప్పుల వేడినీటిలో రెండు టీస్పూన్ల కొత్తిమీర కలపండి. మూతపెట్టి తక్కువ మంట మీద 15 నిమిషాలు ఉడకనివ్వాలి. మంటను ఆపి, నీటిని వడకట్టి, అది చల్లారిన తర్వాత, టీస్పూన్ తేనె వేసి బాగా కలపాలి.కొత్తిమీర పానీయంతో ఆరోగ్య ప్రయోజనాలు ఏంటంటే.. ఇది థైరాయిడ్, మధుమేహం, బరువు సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుంది.చర్మాన్ని శుభ్రపరుస్తుంది.జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.జలుబు తగ్గించడంలో సహాయపడుతుంది.కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది.ఉదయం పూట ఒక వెచ్చని గ్లాసు నిమ్మకాయ నీళ్లలో తేనెతో కలిపి తాగడం వల్ల నిమ్మ నీరు మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.శరీరాన్ని యాక్టివ్ చేస్తుంది.ఇంకా చర్మాన్ని శుభ్రపరుస్తుంది.బరువు తగ్గడంలో సహాయపడుతుంది.ఇంకా ఉసిరి ముక్కలను నీటిలో కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టండి. ఒక రోజు అలాగే ఉంచి, ఆపై వడకట్టండి. మీ శరీరాన్ని యాక్టివ్ చేయడానికి ఈ నీటిని త్రాగండి. ఉసిరికాయను నీటితో కలిపి తయారుచేసిన ఉసిరి రసం విటమిన్ సి ని అందిస్తుంది. ఇది జుట్టు పెరుగుదలకు, బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.


అలాగే తులసి అన్ని రకాల వ్యాధులను నయం చేయడానికి సహాయపడుతుంది. తులసి ఆకులను నీటిలో రెండు ఎండుమిర్చి వేసి మరిగించి తులసి నీళ్లను తయారు చేయండి.ఇది జ్వరం, ఇతర బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇంకా రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. డెంగ్యూ, మలేరియా, హెపటైటిస్, క్షయ ఇంకా అలాగే స్వైన్ ఫ్లూ నుండి కోలుకోవడంలో చాలా బాగా సహాయపడుతుంది.శరీరం ఇంకా చర్మాన్ని ఆరోగ్యాంగా ఉంచుతుంది.ఇది యాంటీబయాటిక్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలను కలది.ఇది శ్వాసకోశ వ్యాధులను అధిగమించడంలో సహాయపడుతుంది.ఇంకా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.అలాగే ఇందులోని విటమిన్లు A, C మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా దంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది.ఇలా నీళ్లు తాగితే అందం, సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: