పంటి నొప్పి ఈజీగా తగ్గాలంటే ఇలా చెయ్యండి.

Purushottham Vinay
ఇక ఆధునిక జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలా మంది కూడా పంటి నొప్పుల సమస్యలతో చాలా బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే..కాల్షియం లేకపోవడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేయకపోవడం, జ్ఞాన దంతాలు ఇంకా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ మొదలైనవి సమస్యలు ఉత్పన్నం కావడం. అయితే ఇక ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి మార్కెట్‌లో చాలా రకాల ఉత్పత్తులున్నాయి. కానీ ఇవి అన్నీ కూడా ఆశించిన ఫలితాలను ఇవ్వలేక పోతున్నాయి. పంటి నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి ఆయుర్వేద శాస్త్రంలో చాలా రకాల మార్గాలున్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఇక పంటి నొప్పికి లవంగం అనేది చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ పరిహారాన్ని కొన్ని శతాబ్దాలు క్రితమే ఆయుర్వేద శాస్త్రంలో కొనుగొన్నారు.అలాగే లవంగం కూడా ఓ ఆయుర్వేద ఔషధంగా పరిగణించారు. మీకు దంత సమస్యల ఉంటే.. రెండు మూడు లవంగాలను తీసుకుని వాటిని కొద్దిగా దంచి మీ పంటి కింద ఉంచితే ఉపశమనం కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది.


అలాగే ఇంగువ పంటి నొప్పికి చాలా బెస్ట్ రెసిపీగా చెప్పవచ్చు. పంటి నొప్పి నుంచి మంచి ఉపశమనం పొందడానికి రెండు నుంచి మూడు చిటికెల ఇంగువలో రెండు నుంచి నాలుగు చుక్కల నిమ్మరసంని మిక్స్ చేసి, ఆ పేస్ట్‌ను మీ దంతాలకు మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది.ఇంకా అలాగే ఉప్పు అనేక వ్యాధులకు ఔషధమని ఆయుర్వేద శాస్త్రంలో వివరించారు. ఇక పంటి నొప్పిని విముక్తి పొందడానికి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రాళ్ల ఉప్పును కలిపి, ఆపై ఆ నీటితో మీ దంతాలను శుభ్రం చేసుకోండి.ఇక ఇలా రోజుకు కనీసం రెండు మూడు సార్లు పుక్కిలించడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది.అలాగే పంటి నొప్పి సమస్యతో బాధపడతుంటే.. ఉల్లిపాయలను వినియోగించి ఉపశమనం పొందవచ్చని కూడా శాస్త్రంలో పేర్కొన్నారు. ఇక దీని కోసం, ఉల్లిపాయను తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసి నొప్పి ఉన్న వైపు ఉంచి బాగా నమలండి. దీని వల్ల త్వరలోనే మీకు మంచి ఉపశమనం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: