పాలకూర అతిగా తింటే ఏమవుతుందో తెలుసా..?

Divya
మనం నిత్యం యవ్వనంగా.. ఆరోగ్యంగా ఉండాలి అంటే.. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో తగిన నిష్పత్తిలో పోషకాలు అనేది తప్పనిసరిగా ఉండాలి. అలా ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయో.. అప్పుడు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండడమే కాకుండా ఎలాంటి జబ్బులు మన దరిచేరవు. శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే పౌష్టికాహారం మొదటి పాత్ర పోషిస్తుంది అలా పోషకాలు ఎక్కువగా ఉండే ఆకు కూర ఏదైనా ఉంది అంటే అది కేవలం పాలకూర మాత్రమే అని చెప్పవచ్చు. శరీరానికి కావాల్సిన పోషకాలు ఇందులో ఉన్నాయని వైద్యులు సిఫార్స్ చేస్తున్నారు.

పాలకూర ఆకులలో విటమిన్ ఎ, ఫోలేట్, విటమిన్ సి,  క్యాల్షియం, ఫోలిక్ ఆమ్లం,  ఐరన్ వంటి ఖనిజాలు  పుష్కలంగా లభిస్తాయి.. ఇవి శరీరానికి కావలసిన పోషకాలను అందించి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్థాయి. ఇకపోతే పాల కూర తినడం వల్ల మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి ఇప్పుడు మనం ఒక సారి చదివి తెలుసుకున్నాం.

అధిక బరువు:
అధిక బరువును నియంత్రించడంలో పాలకూర మొదటి పాత్ర వహిస్తుంది. కూరలో చక్కెర, కొవ్వు పదార్థాలు ఉండవు. ఫలితంగా బరువు తగ్గే అవకాశాలు ఎక్కువ. మినరల్స్, విటమిన్స్ వల్ల బరువు పెరిగే అవకాశం లేదు.. కాబట్టి ఎవరైనా సరే అధిక బరువును తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తే తప్పకుండా వారి డైట్ లో ఈ పాలకూర ను చేర్చుకోవాలి.
మెదడు పనితీరు:
పాలకూరలో యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా లభించడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అంది మెదడు పనితీరు మెరుగుపడుతుంది. అంతేకాదు జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది అని వైద్యులు సలహా ఇస్తున్నారు. కాబట్టి ప్రతి రోజూ ఒక కప్పు పాలకూర తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది.
జీర్ణక్రియ పనితీరు:
పాలకూరలో పీచుపదార్థాలు సమృద్ధిగా లభించడం వల్ల జీర్ణక్రియ సమస్యలు దూరమవుతాయి. అంతే కాదు తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి చాలా బాగా పనిచేస్తుంది.
వీటితో పాటు కంటి చూపు మెరుగు పడటానికి కూడా ఈ పాలకూర చాలా బాగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: