వాటిని మరవడం వల్లే.. మనకు తంటాలు..

Shanmukha
ప్రస్తుతం దేశ జనాభా పరిస్థితి ఎలా ఉందో తెలిసిందే. రోజుకో కొత్త రోగంతో విలవిల లాడుతున్నారు. అంతేకాకుండా 20ల్లోనే 60 ఏళ్ల వయసువారిలా రోగాల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే గుండె జబ్బులు, అల్సర్లు, డయాబెటీస్ వంటి జబ్బులతో భాధపడుతున్నారు. అయితే దీనికి వైద్యులు చెప్తున్న కారణం వారిలో రోగనిరోధక శక్తి లేకపోవడం. అసలు మనకి రోగనిరోధక శక్తి ఎందుకు తగ్గుతుంది. మన పెద్దవాళ్లు 90 ఏళ్ల వయసులోనూ చలాకీగా ఎలా ఉంటున్నారు? మనం మాత్రం 20-30ఏళ్లకే రోగాల బారిన ఎందుకు పడుతున్నాం? దానికి సమాధానం మన అలవాట్లు. అవును మన అలవాట్లే మనలను కుంగదీస్తున్నాయి. ప్రతి రోజూ మనం తీసుకునే ఆహారమే మనలను బలహీనం చేస్తున్నాయి.


ఇక మన ఆహార విషయానికి వస్తే.. పలానాది తింటే ఇలా అవుతుంది, మరొకటి తింటే ఇంకేదో అవుతుందని చెప్పి కొన్నింటిని విడిస్తే, మరికొన్నింటిని నోటి రుచికోసం విడిచిపెట్టాం. అయితే సాధారణంగా మన ఇళ్లలో వండే వంటలతోనే ఎన్నో రోగాలు చెక్ చెప్పచ్చు. వాటిలో వాడే ప్రతి దినుసు కూడా శరీరంలో చెడును తగ్గించేందుకు దోహదం చేస్తాయి. అంతేకాకుండా ప్రతి పండు కూడా మనం ఆరోగ్యంగా ఉండేందుకు సహాయ పడతాయి. కానీ మనం మాత్రం పిజ్జాలు, బర్గర్లు అంటూ వాటి వెనుక పడుతున్నాం. వాటిలో ఎటువంటి పోషకాలు అందకపోగా మన శరీరాన్ని లోలోపల మరింత బలహీనం చేస్తాయి. ఇవన్నీ మనకూ తెలుసు కానీ పట్టించుకోం. ఏమైనా చిన్న జ్వరం, జలుబు వంటి రోగాలు వస్తే ఇదివరకు వాడే కషాయాలు, ఆవిరి పట్టడం వంటివి చేసుకోకుండా వెంటనే మందుల షాపుకు వెళ్లి ఓ మందుమాత్ర వేసుకోవడానికి అలవాటు పడిపోయాం.

 
అయితే మన కూరల్లో వాడే పదార్థాలు ఎంతో మేలు చేస్తాయి. ఉదాహరణకు కొన్ని తెలుసుకుందాం రండి.. అల్లం తింటే కడుపుబ్బరం తగ్గడంతో పాటు మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే కరివేపాకు రక్తహీనతను తగ్గిస్తుంది. గుమ్మడి కాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. మామిడి పండు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. ఆవాలు శరీరంలో ఇన్సులిన్‌ని పునరుద్దరిస్తుంది. అంతేకాకుండా అజీర్తిని కూడా తగ్గిస్తుంది. కీరాదోసకాయ తింటే జట్టుకు మంచిది. క్యారెట్ మన జ్ఞాపక శక్తిని మెరుగుపరచడమే కాకుండా నరాల బలహీనతను కూడా తగ్గిస్తుంది. ఉల్లిపాయ శ్వాస కోశ సమస్యలను తగ్గిస్తుంది. పుచ్చకాయ తింటే గుండె, చర్మ సంబంధిత రోగాల నుంచి విముక్తి లభిస్తుంది. దాల్చిన చక్క పంటి నొప్పిని తగ్గిస్తుంది. ఈ విధంగా మన కూరగాయలు, పండ్లు మనశరీర రుగ్మతలను తగ్గించడంలోనూ, రాకుండా చేయడంలోనూ ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిని విస్మరించడం వల్లే ఇప్పుడు మన దేశ కుర్రకారుకు ఇన్ని ఆరోగ్య సంబంధిత ఇబ్బందులు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: