ఏపీ ఆ జిల్లాకు ఊహించిన గిఫ్ట్ .. ఏడాదికి 1000 కిలోల గోల్డ్..!?

Amruth kumar
బంగారం అంటే భారతీయులకు ప్రత్యేకమైన ప్రేమ. ధరలు ఆకాశాన్ని తాకుతున్నా.. మనవాళ్లు కొనడం ఆపట్లేదు. ప్రస్తుతం దేశంలో పది గ్రాముల బంగారం ధర లక్ష రూపాయల పైగా ఉంది. భారతీయుల దగ్గర బంగారం నిల్వలు భారీగా ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలో పలు ప్రాంతాల్లో బంగారం నిక్షేపాలు గుర్తించబడ్డాయి. వాటిలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా కూడా ఉంది. అక్టోబర్ చివరి నుంచి ఈ ప్రాంతంలో బంగారం ఉత్పత్తి ప్రారంభం కావనుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం బొల్లవానిపల్లి, జొన్నగిరి, జీ.ఎర్రగుడి, పగిడిరాయి గ్రామ పరిసర ప్రాంతాల్లో సుమారు 597.82 హెక్టార్లలో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.

 

ఏళ్ల తరబడి పరిశోధనలు, సర్వేలు చేసిన తర్వాత శాస్త్రవేత్తలు ఈ ప్రదేశంలో బంగారం నిజంగా ఉందని నిర్ధారించారు. ఈ ప్రాజెక్టును జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేటు కంపెనీ ముందుకు తెచ్చింది. మైనింగ్ దిగ్గజం బి.ప్రభాకరన్ ఈ ప్రాజెక్ట్ బాధ్యతలను పర్యవేక్షించనున్నారు. ఈ బంగారం వెలికితీసే ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేయబడింది. అక్టోబర్ చివరి లేదా నవంబర్ ప్రారంభం నుంచే ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. మొదట సంవత్సరానికి సుమారు 500 కిలోల బంగారం ఉత్పత్తి చేయడం లక్ష్యం. తర్వాత ఈ మొత్తాన్ని 1000 కిలోలకు పెంచాలని యోచిస్తున్నారు. 24 క్యారెట్ల పసిడిని చట్టబద్ధంగా ప్రాసెసింగ్ చేయనున్నారు. 30 ఏళ్ల క్రితం జియో మైసూర్ సర్వీసెస్ రైతుల నుంచి భూమిని లీజు తీసుకొని సర్వేలు, డ్రిల్లింగ్ చేపట్టింది. మొదట ఎకరాకు రూ.4,500 చెల్లిస్తూ లీజు తీసుకున్నారు.

 

తర్వాత భూమిని కొనుగోలు చేసే విధానం ప్రారంభం అయింది. ఇప్పటివరకు 283 ఎకరాలను ఎకరాకు రూ.12 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. మిగతా భూమికి సంవత్సరానికి రూ.18 వేల చెల్లించేందుకు ముందుకొచ్చారు. ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటివరకు దాదాపు 600 మందికి ఉపాధి లభించింది. భవిష్యత్తులో మరింత మందికి ఉపాధి కల్పించనున్నట్టు కంపెనీ యాజమాన్యం తెలిపింది. కర్నూలులో బంగారం వెలికితీసే ఈ ప్రాజెక్ట్, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి, కొత్త ఉపాధి అవకాశాలకు, రాష్ట్రానికి భారీ ప్రాముఖ్యత కలిగిస్తుంది. భారతీయుల పసిడి పట్ల ప్రేమను మరింత పెంచే ఈ బంగారం ప్రాజెక్ట్ మాస్‌గా, విపరీతంగా ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: