20 వేలు తగ్గిన బంగారం ధర.. ఇంకా తగ్గుతుందా ?

VAMSI
జాతీయంగా మరియు అంతర్జాతీయంగా జరిగే వ్యాపారాలలో కొన్ని మార్పుల వలన బంగారం ధరలలో హెచ్చు తగ్గులు జరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు పెరగడం తగ్గడం వలన కొందరు లాభ పడడం మరి కొందరు నష్ట పోవడం జరగొచ్చు. బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త. పది కాదు వంద కాదు ఏకంగా ఇరవై వేలు రూపాయలు బంగారం పై తగ్గింది. నిజంగా ఇది పెద్ద గుడ్ న్యూస్. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది ఉపయోగపడే చక్కటి సమయం అనే చెప్పాలి. అయితే కేజీ బంగారం ధరపై మొత్తంగా 20 వేల రూపాయల వరకు తగ్గిందని తెలుస్తోంది. అది కూడా 22 క్యారెట్ల కేజీ బంగారం ధర పై రూ.20వేల వరకూ తగ్గిందని సమాచారం. దీని కారణంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర లో కూడా తగ్గుదల ఉండనుంది. రూ.47వేల 450 వరకు ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.51వేల 760కు చేరుకుంది.
దేశ రాజదాని ఢిల్లీ లో పది గ్రాముల బంగారం విలువ  రూ.47వేల 500 ఉండగా, 24క్యారెట్ల బంగారం ధర రూ.51వేల 800 గా ఉన్నది. ముంబై నగరంలో 22క్యారెట్ల బంగారం ధర రూ.47 వేల 450గా ఉంది. బంగారాన్ని కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది  మంచి వార్త.  అలాగే అధిక మొత్తం లో బంగారం కొనుగోలు చేసి విక్రయించే వ్యాపారస్తులకు బంగారం కొనేందుకు ఇది మంచి తరుణం అంటున్నారు. ఎక్కువ మొత్తం లో  బంగారం కొనుగోలు చేసే వారికి తగ్గిన బంగారం ధరలు బాగా లాభాన్ని తెచ్చిపెడతాయి.
ప్రస్తుతానికి బంగారం ధరలు పై విధంగా ఉన్నాయి ఇక పోను పోను ఏమైనా తగ్గుతాయా అన్నది చూడాలి. ఇక ఇప్పుడు ఉన్న ధరలు అయితే అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటాయి అని చెప్పవచ్చు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: