బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!

Satvika
ఈరోజు మహిళలకు షాకింగ్ న్యూస్..బంగారం కొనాలని అనుకోనేవారికి షాక్..నేడు మార్కెట్ లో బంగారం, ధరలు పరుగులు పెడుతూన్నాయి.నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో పైకి కదిలాయి..వెండి ధరలు కూడా అదే దారిలో పయనించాయి..మనదేశంలో బంగారం ధరలు పెరిగితే, అంతర్జాతీయ మార్కెట్ లో మాత్రం కిందకు దిగి వచ్చాయి..10 గ్రాముల పసిడిపై రూ.430 వరకు పెరుగగా, కిలో వెండిపై రూ.1150 వరకు పెరిగింది. అయితే బంగారం, వెండి ధరలు పెరగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి..


నేడు ప్రధాన మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద కొనసాగుతోంది. అలాగే విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900 వద్ద ఉంది.

 
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,900 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,870 వద్ద ఉంది..బంగారం పెరిగితే..వెండి ధరలు కూడా భారీగా పెరుగుతాయి..కిలో వెండిపై రూ.1150 వరకు ఎగబాకింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.61,150 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.66,000 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.66,000 ఉండగా, చెన్నైలో రూ.66,000 ఉంది..ఈరోజు భారీగా పెరిగిన ధరలు రేపు మార్కెట్ లో ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: