బంగారం కొనేటప్పుడు ఈ పాయింట్స్ గుర్తించుకోండి ?

VAMSI
బంగారం అంటే ఆడవారికే కాదు మగవారికి కూడా చాలా ఇష్టమే. ఎందుకంటే ఇది ఒక స్థిరాస్తి లాంటిదే. అందులోనూ బంగారం ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూ వారికి లాభదాయకంగా ఉంటాయి. అలా బంగారం అంటే అసలు ఇష్టం లేని వారు ఉండరు. అయితే బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మిమ్మల్ని ఏమార్చే వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంతకీ బంగారం కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ముఖ్యంగా 8 అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ ఆ కీలకమైన విషయాలు ఏమిటో తెలుసుకుందాం పదండి.
బంగారు ఆభరణాల తయారీ దారులకు 10 గ్రాముల బంగారం ఇస్తే కొందరు మనకు అంతకు కొంత యాడ్ చేసి 10.44 గ్రాములు బంగారు విలువైన ఉంగరమో లేదా మరేదైనా బంగారు వస్తువో ఎక్కువగా ఇస్తారు. మనం ఇచ్చేది తక్కువ బంగారం అయితే వారెందుకు తిరిగి అదనంగా ఎక్కువ ఇస్తున్నారు అని ఎపుడైనా ఆలోచించారా...!!
బంగారం ఒక  ప్రత్యేకమైన లోహం అందులోనూ తక్కువ లభ్యత , అందులోనూ అందమైన ఆభరణాలకు కేరాఫ్ అడ్రెస్స్ కావడం వంటి పలు కారణాల వలన బంగారానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. రాజుల కాలంలో బంగారాన్ని కూడా డబ్బు లాగే మార్పిడి జరుగుతూ ఉండేది. బంగారు నాణేలు అందుబాటులో ఉండేవి.  డబ్బుకు బదులుగా ఎక్కువుగా బంగారం క్రయవిక్రయాల్లో ఇచ్చిపుచ్చుకునేవారు అప్పటి వర్తకులు.
అయితే ఇప్పటి కాలం లో బంగారాన్ని చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇక బంగారు ఆభరణాలు కొనేటప్పుడు ముఖ్యంగా మూడు విషయాలను మాత్రమే అంతా ఎక్కువగా ఆరా తీస్తారు.
ఆభరణం 24క్యారెట్ లేక 22 నా ..?? ధర ఎంత ? అందులో తరుగు ఎంత? కాగా తరుగు విషయం గురించి విశాఖపట్నంలో కొందరు బంగారు తయారీదారులు ఆసక్తికర విషయాలను తెలుసుకుంది . బంగారు ఆభరణాల తయారీలో 25 ఏళ్లకు పైగా  అనుభవమున్న విశాఖ నగర స్వర్ణకారుడు, విశ్వబ్రాహ్మణుల సంఘం అధ్యక్షుడు అయిన గురజాపు రవి బంగారంకు సంబందించిన కొన్ని కీలక విషయాలను వెల్లడించారు.
1. ఏ బంగారం మంచిది?
సాధారణంగా చాలామంది కి 24 లేదా 22 క్యారెట్ బంగారం మాత్రమే తెలుసు. అయితే బంగారం నాణ్యత లేదా స్వచ్ఛతను 0 నుంచి 24 క్యారెట్ల రూపంలో కొలుస్తారని ఆయన తెలిపారు. బంగారం చాలా మృదువుగా ఉంటుంది కాబట్టి గట్టిదనం చేకూర్చడం కోసం రాగి, వెండి, కాడ్మియం, జింక్ వంటి ఇతర లోహాలను కలిపి ఆభరణాలు తయారుచేస్తారు. ఈ లోహాలు కలిసిన శాతం ఆధారంగా బంగారం స్వచ్ఛతను నిర్ణయిస్తారు. 24 క్యారెట్ల బంగారం అనేది  99.99 శాతం నాణ్యతను కలిగి ఉండేది . ఇందులో స్వల్ప మోతాదులో మాత్రమే ఇతర లోహాలు ఉంటాయి.
22 క్యారెట్ల బంగారం అనగా అందులో 91.6 శాతం బంగారం ఉండగా 8.4 శాతం వరకు ఇతర లోహాలు కలిసి ఉంటాయి. ఇక 18 క్యారెట్లు అంటే బంగారం స్వచ్ఛత 75 శాతం ఉండగా ఇతర లోహాలు 25 శాతం ఉంటాయి. అంటే ఇందులో బంగారం శాతం చాలా తక్కువ.  
14 క్యారెట్లలో బంగారం 58.5 శాతం అదే విధంగా 12 క్యారెట్లలో 50 శాతం, అలాగే 10 క్యారెట్లలో 41.7 శాతానికి మించి బంగారం ఉండదు. కాగా ఎక్కువగా 22 క్యారెట్ల బంగారం తోనే సాధారణంగా ఆభరణాలు తయారు చేస్తారు.
అయితే బంగారం కొనేటప్పుడు కానీ ఎక్స్చేంజ్ చేసుకునేటప్పుడు.. కానీ ఇక్కడ మోసపోతారు అంటే, 22 క్యారెట్ ని 24 క్యారెట్ అని చెప్పడం అలాగే స్టోన్ వర్క్ ఉన్న బంగారు ఆభరణాలు కొనుగోలు చేయడం దగ్గర, ఎందుకంటే  స్టోన్స్‌తో కూడిన ఒక ఆభరణం బరువు 20 గ్రాములు ఉందనుకోండి... అందులో ఐదు గ్రాములు స్టోన్స్ ఉంటే, రాళ్ల బరువును కూడా బంగారం ధరకే లెక్క వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలా స్టోన్స్ కి సైతం బంగారం వెలను చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువగా ప్లైన్ బంగారు ఆభరణాలు కొనడానికి చూడండి. అలాగే బంగారం క్యారెట్ విషయంలో జాగ్రత్త వ్యవహరించి రంగును గుర్తించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: