పరుగులు పెడుతున్న పసిడి, వెండి ధరలు..!
మన దేశంలో హైదరాబాద్ లో పసిడి ధరలు మార్కెట్ లో ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి చుద్దాము.. ఏప్రిల్ 10 న పెరిగింది.బంగారం పదిగ్రాముల పై రూ.350లు, కిలో వెండి పై రూ.300 లు పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 48,600 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 53,020 రూపాయలుగా ఉంది. వెండి హైదరాబాద్ మార్కెట్ లో కిలో 71.500 రూపాయలుగా నమోదు అవుతూన్నాయి. ఇకపోతే ఇదే ధరలు దేశమంతా నమోదు అవుతున్నాయి.. బంగారం ధరలు భారీగా పెరిగితే..మార్కెట్ లో వెండి ధరలు కూడా అదే దారిలో పయనించాయి..ఈరోజు ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.
కాగా, మరో వైపు అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు ఈరోజు ఎలా ఉన్నాయో ఒకసారి చుద్దాము..అంతర్జాతీయ మార్కెట్లో భారీగా తగ్గాయి. బంగారం ధర 1.3 శాతం చేరింది. దాంతో నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఔన్స్‌కు 1923 డాలర్లకు దిగి వచ్చింది. ఇక వెండి ధరలు కూడా ఇంతే. దీని ధర 1.51 క్షీణతతో ఔన్స్‌కు 24.75కు చేరింది. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు తగ్గినా కూడా మన దేశంలో పసిడి రేట్లు పెరగడం గమనార్హం.. మొత్తానికి ఈరోజు మన మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. శ్రీరామనవమికి ఇది షాక్ ఇచ్చే వార్త అనే చెప్పాలి.. మరి మార్కెట్ లో సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..