భారీగా పెరిగిన బంగారం ధరలు.. తగ్గిన వెండి ధరలు..!

Satvika
పసిడి ప్రియులకు బాడ్ న్యూస్.. నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు నేడు మార్కెట్ లో మళ్ళీ షాక్ ఇస్తున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలలొ వ్యత్యాసాలు రావడం తో మన దేశంలో కూడా బంగారం ధరలు పెరిగాయి. నిన్న కాస్త ఊరట కలిగిస్తున్న పసిడి ధరలు ఈ రోజు మరింత పైకి కదిలింది. బంగారం ధరలు పైకి కదిలిన కూడా.. వెండి ధరలు మాత్రం భారీగా తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేయాలనీ అనుకున్న వారికి ఇది జలక్ ఇచ్చే వార్త అనే చెప్పాలి. విదేశీ మార్కెట్ లో మాత్రం బంగారం తగ్గిన కూడా వెండి ధరలు కూడా కిందకు దిగి వచ్చింది.


ఇకపోతే హైదరాబాద్.. మార్కెట్లలో బంగారం ధర బుధవారం భారీగా పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 పెరగగా, దీంతో పసిడి రేటు రూ. 50,620కు పైకి జరిగింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 పైకి చేరింది. పసిడి రేటు రూ. 46,400కు ఎగసింది. బంగారం ధరలు జిగేల్ మంటే.. వెండి మాత్రం భారీగా కిందకు తగ్గింది. రూ.400 దిగివచ్చింది. ఈ మేరకు కేజీ వెండి ధర రూ.68,200కు తగ్గింది.. మొత్తానికి వెండి ధరలు తగ్గడం తో వెండి వస్తవులు, ఆభరణాలను కొనుగోలు చేయడానికి జనాలు ముందుకు వస్తుంది.


కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. ఔన్స్‌కు 0.19 శాతం క్షీణించింది. బంగారం ధర ఔన్స్‌కు 1852 డాలర్లకు భారీగా తగ్గింది. వెండి మాత్రం షాకిస్తూ పెరిగింది. వెండి ధర ఔన్స్‌కు 0.13 శాతం పెరుగుదలతో 23.31 డాలర్లకు ఎగసింది.ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు మొదలగు అంశంపై బంగారం ధరలు ఆధారపడుతూంది. ఇప్పుడు పొందుపరిచిన బంగారం ధరలు ఉదయం 7 గంటలకు నమోదు అయినవి. ఇప్పుడు సాయంత్రానికి ధరలలొ ఎటువంటి మార్పులు వస్తాయెమొ చూడాలి. మరి రేపు ధరలు ఏ విధంగా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: