మళ్లీ మహిళలకు షాక్ ఇచ్చిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి..!!

Divya
మాఘ మాసం వేళ శుభకార్యాలు ఎన్నో జరుగుతున్నాయి.. పెళ్లిళ్లను మొదలుకొని శ్రీమంతాలు, గృహప్రవేశాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో శుభకార్యాలు ఈ మాఘ మాసం లోనే జరుగుతాయి ఎందుకంటే ఏ మాసంలో లేని అన్ని శుభ ఘడియలు ఈ మాఘమాసం లోని ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు తమ వేడుకలు జరుపుకోవాలని నిర్ణయం కూడా తీసుకుంటారు.. అందులో భాగంగానే శుభకార్యాలకు బంగారు కొనడం ఆనవాయితీ. పెళ్లిళ్లు వంటి శుభ కార్యాలలో బంగారు ఆభరణాలను తప్పకుండా కొనుగోలు చేస్తారు.. కాబట్టి ప్రస్తుతం బంగారు కొనుగోలు చేసే వారికి కొంత నిరాశ కలిగింది అని చెప్పవచ్చు. గత రెండు మూడు రోజుల నుంచి బంగారం ధరలు రోజు రోజుకు పైకి ఎగసిపడుతున్నాయి. అయితే ఈ బంగారు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కొన్న వారికి కొంత నిరాశ మిగిలింది అని చెప్పవచ్చు. అంతేకాదు ఈ రోజు కూడా స్వల్పంగా బంగారం ధరలు పెరగడం వెండి రేట్లు మాత్రం స్థిరంగా వుండడం గమనార్హం.
ఇక ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని మనం చదివి తెలుసుకుందాం.ఇకపోతే గత ఆరు రోజుల్లో ప్రతి పది గ్రాముల బంగారంపై రూ. 1,860 వరకూ  పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్క సారిగా రూ. 51 వేల మార్క్ ను బంగారం అందుకోవడం సంచలనమే అని చెప్పవచ్చు. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 వుండగా..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060 కి చేరింది. ఇక అలాగే ఒక కిలో  వెండి ధర రూ. 67,400 గా నమోదుఅయ్యింది.
హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 గా ఉండగా..24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060 కి చేరింది. వెండి కిలో రూ.67,400 గా నమోదయింది. ముంబాయిలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 46,810 , అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 51,060 కి చేరింది. ఒక కిలో గ్రాము వెండి ధర రూ. 63,000 గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: