నేడు మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే....

N.ANJI
మగువలకు నేడు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. గత రెండు రోజుల నుండి బంగారం ధరలు మళ్ళి పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.47,590 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 49,590 కి చేరుకుంది. అయితే తులం బంగారంపై రూ.430 పెరిగింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం.
అయితే ముందుగా దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,700 చేరుకోగా..  24 క్యారెట్ల బంగారం ధర రూ.52,040గా కొనసాగుతుంది. అంతేకాదు.. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,590 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,590 ఉంది. అంతేకాదు.. తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,810 కొనసాగగా.. 4 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000కి చేరుకుంది.
ఇక పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,800 చేరగా..  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,500 ఉంది. అలాగే కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,550 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700గా కొనసాగుతుంది. అయితే కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,550 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,700 ఉంది.
అయితే మన తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దామా. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది. ఏపీలోని ప్రధాన నగరాలైన విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,550 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700 ఉంది. అలాగే విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,700కి చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: