గుడ్ న్యూస్: పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్..!!

N.ANJI
గత కొద్దిరోజులుగా పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలకు బ్రేక్ పడింది. నేడు పసిడి ధర స్థిరంగా ఉంది. అయితే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.47,090 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 49,090గా కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని అయినా ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,140 కొనసాగగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430కి చేరుకుంది. అలాగే దేశ మార్కెటింగ్ రాజధాని అయినా ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,090 చేరగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090కి చేరింది.
ఇక తమిళనాడు రాజధాని అయినా చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,340 కొనసాగగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,440 వద్దకి చేరుకుంది. దేశంలో మెట్రో సిటీ అయినా కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990 చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 కొనసాగుతుంది.
అంతేకాదు.. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,300 చేరుకోగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,000 వద్ద ఉంది. అలాగే దేశంలో అక్షరాస్యతలో ముందున్న కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,990 చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090 వద్ద ఉంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు ప్రజలకు ఊరటను కలిగిస్తున్నాయి. ఇక తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,990 చేరగా..  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,990 చేరగా..  24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 కొనసాగుతుంది. అలాగే విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,990 చేరగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: