పండుగ వేళ బంగారం కొనే మహిళలకు శుభవార్త..!!

Divya
బంగారం అంటేనే మహిళలకు అత్యంత ప్రీతి అన్న విషయం తెలిసిందే.. పండుగ , పబ్బం, ఫంక్షన్ , పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు సందర్భాన్ని బట్టి రకరకాల బంగారు నగలను ధరిస్తూ మురిసిపోతుంటారు మగువలు. అయితే రోజురోజుకు బంగారు ధర పెరిగిపోతున్న నేపథ్యంలో కొనుగోలు చేయాలో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో బిక్కమొహం వేసుకుని చూస్తున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.. అలాంటి వారి కోసమే కొన్ని బంగారు నగలు తయారీ సంస్థలు సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా దసరా పండుగ సందర్భంగా నవరాత్రుల్లో బంగారు నగలు కొనాలనుకునే వారికి ఇది ఒక అతిపెద్ద శుభవార్త అని చెప్పవచ్చు.
ఈ క్రమంలోనే కళ్యాణ్ జువెలర్స్ కు చెందినటువంటి  క్యాండెరే బ్రాండ్ వాళ్ళు మహిళలకు అదిరిపోయే ఆఫర్ లను ప్రకటిస్తున్నారు. నాభన్ నివారా లప్పా గోల్డ్ నెక్లెస్ పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించడం గమనార్హం మేకింగ్ ఛార్జెస్ పై సుమారు 55 శాతం రాయితీతో మనకు లభించనుంది.. అంటే మనకు 9,200 రూపాయలు మేకింగ్ చార్జెస్ ఆదా అవుతాయి అన్నమాట. మార్కెట్లో మనం ఈ నెక్లెస్ ను కొనుగోలు చేసినట్లయితే.. దీని ధర రూ.54,773.. కాగా అదే కళ్యాణ్ జ్యువెలర్స్ వాళ్ళు ఆఫర్లో భాగంగానే మనకు ఈ నెక్లెస్  రూ.45,562 కే కొనుగోలు చేయవచ్చు.
అంటే మేకింగ్ ఛార్జెస్ పై సుమారుగా 55 శాతం రాయితీతో మనకు లభిస్తుంది. అయితే ఈ పండుగ వేళ మీరు ఆన్లైన్లో మాత్రమే కొనుగోలు చేయాలి.. ఇందుకోసం త్యోహార్ అనే కూపన్ కోడ్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఇక పూర్తి ధరల విషయానికి వస్తే..బంగారు మెటల్ ధర రూ.36,918..ఇక తయారీ ఛార్జీలు రూ.7,317. కాగా జిఎస్టి 1327 రూపాయలు పడుతుంది. 22 క్యారెట్ల విలువ కలిగిన ఈ నెక్లెస్ బరువు 8.13 గ్రాములు అయితే ఇది కేవలం మనకు ఆన్లైన్లోనే లభించడం గమనార్హం. ఇందుకోసం మీరు మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేసి ఈ నక్లెస్ మీ ఏరియాకు వస్తుందో లేదో కూడా ఎంక్వయిరీ చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: