గోల్డ్ ఇటిఎఫ్‌ అంటే ఏంటి ? ఎలా కొనాలి ?

Vimalatha
ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.43,990 , 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర ధ‌ర రూ. 47,990. కేజీ వెండి ధ‌ర రూ.800 పెరిగి రూ.63,400.
 
మంచి రాబడి కోసం మాత్రమే పెట్టుబడి పెట్టాలనుకుంటే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF) మంచి ఎంపిక. గోల్డ్ ఇటిఎఫ్‌లు ఇతర ఇటిఎఫ్‌ల మాదిరిగానే ఉంటాయి.  అయితే ఒక యూనిట్ ఇటిఎఫ్ 1 గ్రాముల బంగారంతో సమానం. ఈ విలువైన లోహం ప్రస్తుత మార్కెట్ ధరను ట్రాక్ చేస్తుంది. అందువల్ల బంగారం మార్కెట్ ధర ప్రకారం ETFల విలువ పెరుగుతుంది, తగ్గుతుంది. ఇతర మ్యూచువల్ ఫండ్‌ల మాదిరిగా ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్ ధరను నెట్ అసెట్ వాల్యూ (NAV) అని అంటారు.
గోల్డ్ ఇటిఎఫ్‌లు డిమాట్ ఖాతా ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇతర కంపెనీ స్టాక్‌ల మాదిరిగానే నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌ఎస్‌ఇ) లో ప్రస్తుత మార్కెట్ ధర వద్ద ట్రేడ్ చేయవచ్చు. డిమాట్ అకౌంట్‌లోకి లాగిన్ అయిన తర్వాత, గోల్డ్ ఈటీఎఫ్ ఆప్షన్‌లను సెర్చ్ చేయండి. ఫండ్‌ను ఎంచుకోండి. ఇప్పుడు ఆర్డర్ చేయండి. లింక్ చేసిన బ్యాంక్ ఖాతా ద్వారా చెల్లింపు చేయండి. ప్రాసెసింగ్ సమయం తర్వాత గోల్డ్ ఇటిఎఫ్‌ల యూనిట్లు డిమాట్ ఖాతాకు జమ చేయబడతాయి. దీనిని డైరెక్ట్ గోల్డ్ ఇటిఎఫ్ ఆప్షన్ అంటారు. ఇలా ఇటిఎఫ్‌లు డిమాట్ ఖాతా ద్వారా కొనుగోలు చేయవచ్చు. అయితే ఎవరైనా గోల్డ్ ఫండ్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. కానీ నేరుగా డిమాట్ ఖాతా ద్వారా డైరెక్ట్ గోల్డ్ ఇటిఎఫ్‌లో కాదు. ఇది మ్యూచువల్ ఫండ్స్ కోసం ఉపయోగించే రెగ్యులర్ మొబైల్ అప్లికేషన్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ సందర్భంలో డబ్బు ఒకే ప్రాడక్ట్ కు వేరే విధంగా ట్రేడ్ అవుతుంది. ఆ సందర్భంలో ఎక్స్ పెన్స్ రేషియో, ఎగ్జిట్ లోడ్, ఇతర ఫాక్టర్స్ మాత్రం భిన్నంగా ఉంటాయి. వాస్తవంగా పెట్టుబడిదారుడు ఎప్పుడూ బంగారాన్ని కలిగి ఉండే సౌలభ్యం కాకుండా బంగారు ఇటిఎఫ్‌ల ఇతర ప్రయోజనాల కోసం చూడాలి. ఎందుకంటే మార్కెట్‌లో డిజిటల్ గోల్డ్, సావరిన్ గోల్డ్ బాండ్ (ఎస్‌జిబి) వంటి ఇతర పారదర్శక, వర్చువల్ బంగారు ఎంపికలు కూడా గోల్డ్ మార్కెట్ లో ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: