రూ. 100 తో బంగారు... ప్రముఖ జ్యూవెలరీ సంస్థ ఆఫర్ కానీ ?

VAMSI
మారుతున్న డిజిటల్ లైఫ్ లో ప్రతి ఒక్కరూ కాస్తో కూస్తో కంఫర్టబుల్ గా జీవించాలని ఆశపడుతుంటారు. సామాన్య ప్రజలు సైతం ఇంట్లో అన్ని వసతులతో సౌకర్యంగా జీవనం సాగాలని కోరుకుంటారు. ఇదే కారణాన్ని బేస్ చేసుకుని సామాన్య ప్రజల కొనుగోలుకు అనుగుణంగా ఉండేలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తువులను ఈ ఎం ఐ పద్దతుల్లో విక్రయిస్తున్నాయి. ఆన్లైన్ లోనూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. వారికి కావాల్సిన వస్తువులకు ఒక్కసారిగా మొత్తం డబ్బు పెట్టి కొనలేని ప్రజలకు వాయిదాల పద్ధతిలో వస్తువులను అమ్మే పద్ధతిని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులు వాయిదా పద్ధతుల్లో కొనుగోలు చేస్తున్నారు.
అయితే బంగారు ప్రియుల కోసం ఇలాంటి ఆఫరే ఒకటి మార్కెట్ లోకి వచ్చింది. ఇది నిజంగా మహిళలకు బంగారం లాంటి వార్తే మరి. వివరాల్లోకి వెళితే.. తాజాగా కళ్యాణ్ జ్యువెలర్స్ డిజిటల్ గోల్డ్ సర్వీసులను ప్రారంభించింది. మెటల్స్ మేనేజ్‌మెంట్ కంపెనీ ఆగ్మాంట్‌ భాగస్వామ్యం తో ఈ డిజిటల్ గోల్డ్ సర్వీస్ ను అందించనున్నారు కళ్యాణ్ జ్యువెలర్స్ వారు. ఈ పద్దతి ద్వారా ప్రజలు ఆన్లైన్ లో  నగదును చెల్లించి బంగారాన్ని కొనుగోలు చేయవచ్చు.  ఇలా ఇన్వెస్ట్ చేసినటువంటి మొత్తం నగదుకు సరిపడా బంగారాన్ని కల్యాణ్ జ్యువెలర్స్. ఐడీబీఐ ట్రస్టీ కంపెనీ నిర్వహణలోని వాల్ట్‌లలో నిల్వ చేసి సురక్షితంగా ఉంచుతుంది.
ఎటువంటి ఛార్జీలు లేకుండానే ఈ సర్వీసును అందిస్తున్నారు. నెలకు రూ.100 నుంచి నగదు చెల్లించి బంగారాన్ని నిల్వ చేసుకునే గొప్ప అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది కళ్యాణ్ జ్యువెలర్స్. మరి ఈ వార్త తెలిసిన కస్టమర్స్ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో జ్యువెలర్స్ సంస్థలు ఇలాంటి పద్దతిని తీసుకురాగా, గతంలో ఎంతో మంది ప్రజలు ఇలాంటి గోల్డ్ స్కీం ల ద్వారా మోసపోయిన సందర్భాలను ఉన్నాయని కథనాలు వచ్చాయి. పూర్తి వివరాలు మరియు భరోసా లేకుండా ఎవ్వరి దగ్గరా కూడా ఒక్క రూపాయి కూడా కట్టకండి. ఇది మీ రూపాయి ఎవడికైనా తీపే. జర భద్రం అన్న.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: