సాధారణ బంగారం ధరలతో 'హాల్‌మార్క్ గోల్డ్' ధర ఎందుకు మారుతుంది?

Vimalatha
ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.44,100, 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,110.
.
భారతదేశంలో బంగారం ధరలు నగరం నుండి నగరానికి కొద్దిగా మారుతూ ఉంటాయి. అలాగే, హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాల ధరలు సాధారణ బంగారం ధరల నుండి మారుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఆభరణంపై హాల్‌మార్కింగ్ ఛార్జీలతో పాటు నగల వ్యాపారులు విధించే వ్యర్థాలు, మేకింగ్ ఛార్జీలు. అలాగే బంగారు వస్తువులలోని స్వచ్ఛత గ్రేడ్ (23 క్యారెట్, 22 క్యారెట్, 18 క్యారెట్ మొదలైనవి) ప్రకారం ధర మారుతుంది. హాల్‌మార్క్ చేసిన బంగారు ఆభరణాలను విక్రయించే స్వర్ణకారుడు పన్నులు జోడిస్తాడు. అందువల్ల హాల్‌మార్క్ చేయబడిన బంగారం ధర ఖచ్చితంగా సాధారణ బంగారం ధర కంటే భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా  భారతదేశంలో ఇది ఖచ్చితంగా జరుగుతుంది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నుండి లైసెన్స్ మంజూరు పొందడానికి నగల వ్యాపారులు నిర్దేశిత ఫార్మాట్‌లో అప్లికేషన్ విధానాన్ని అనుసరించాలి.

 
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంబంధిత శాఖ కార్యాలయాన్ని సంప్రదించడం ద్వారా BIS (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) సర్టిఫికేషన్ కోసం నిర్దేశిత రూపంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

 
నిర్దేశించిన ఫీజులతో పాటు అడిగిన అన్ని సంబంధిత పత్రాలను జతపరచాలీ. పత్రాల అవసరాలు, ఫీజుల వివరాల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.
ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అన్ని బంగారం షాపులు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే. 24 క్యారెట్లు, 23 క్యారెట్లు, 22 క్యారెట్లు, 18 క్యారెట్లు మొదలైన స్వచ్ఛత ఆధారంగా బంగారం వర్గీకరణ చేస్తారు. 22 క్యారెట్ల బంగారాన్ని 'బిఐఎస్ 916' బంగారం అంటారు. 22 క్యారెట్లు లేదా బిఐఎస్ 916 బంగారాన్ని ఉపయోగించి బంగారు ఆభరణాలను తయారు చేయడం కష్టం అవుతుంది. అందుకే బంగారు ఆభరణాలు తాయారు చేసే, కొనుగోలు చేసే వ్యక్తులలో చాలా మంది సాధారణంగా 22 క్యారెట్లు లేదా 916 బంగారానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: