గోల్డ్ : బంగారం గురించి తెలియని 10 రహస్యాలు..

Divya
బంగారం అనగానే ముందుగా మగువల గుర్తొస్తారు.. మగువలకు బంగారం, చీరలు తప్ప మరేవీ గుర్తురావు అనేది నానుడి.. అయితే ఇంతటి ప్రాముఖ్యతను పొందిన బంగారం గురించి మనకు తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఒలంపిక్స్ లో  ఇచ్చే బంగారు పథకాలను పూర్తిగా బంగారంతో తయారు చేయరట. ఇందులో  1.34 శాతం మాత్రమే ఈ విలువైన ఖనిజం ఉంటుంది. ఒలంపిక్స్ మొదలైన తొలి నాళ్లలో మొత్తం బంగారంతో తయారు చేసిన పథకాలు అందించే వారు. అయితే తయారీ వ్యయం పెరిగిపోతుండడంతో ఆ తర్వాత నుంచి కొద్దిగా బంగారం మాత్రమే కలిపి ఇస్తున్నారు .
2. సాధారణంగా స్వీట్లపై వెండిని పలుచని పొరలా  పోత పూసి తింటారు.. చూశారా అదిగో అచ్చం అలాగే బంగారాన్ని కూడా చాలా పలుచగా చేసి స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలపై పూతలా వేసుకొని తింటారట. దీని వల్ల జీర్ణ శక్తి పెరుగుతుందని చాలామంది నమ్ముతుంటారు.
3. పూర్వకాలంలో మహారాజులు వేడి వేడి అన్నంలో బంగారు పూతలను  కలుపుకుని తినేవారట. అందుకే వారు అంత స్ట్రాంగ్ గా ఉండేవారేమో.
4. వివిధ దేశాలలో బంగారాన్ని కొనడాన్ని మంచి పెట్టుబడిగా భావిస్తారు. మన దేశంలో మాత్రం ఎక్కువ మంది బంగారం కొనడాన్ని శుభసూచకంగా పరిగణిస్తారు. అంతే కాదు దాని వల్ల సంపద వృద్ధి చెందుతుందని భావిస్తారు.
5. ప్రపంచంలోని దేశాలలో ఉన్న బంగారం కంటే 11 శాతం ఎక్కువ బంగారం మన దేశం దగ్గర ఉందట.. అది మన ప్రత్యేకత.
6. బంగారం భూమి మీదనే కాదు.. అంతరిక్షంలో కూడా ఉపయోగపడుతుంది. అంతరిక్షంలో వ్యోమగాములు ధరించే తిరస్త్రానం పై బంగారు పూత పోస్తారట. ఇది సూర్యుని నుంచి వెలువడే ప్రమాదకరమైన ఇన్ఫ్రారెడ్ కిరణాలు పరావర్తనం చెందేలా చేస్తుంది.
7. శరీరంలో 0.2 మిల్లీ గ్రాముల బంగారం కలిగి ఉంటుంది. దీనిలో ఎక్కువ భాగం రక్తంలో ఉండటం గమనార్హం.
8. కొంతమంది బంగారం చూడడానికి భయపడుతుంటారు. దీన్నే ఆరో ఫోబియా అంటారు.
9. ప్రస్తుతం భూమి మీద ఉన్న బంగారం సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం ఉల్కల్ భూమిని ఢీ కొనడం వల్ల వచ్చినవే అట.
10. సముద్రం కూడా సుమారు 20 మిలియన్ టన్నుల బంగారం ఉందట. ఇది ప్రపంచంలోని ప్రజలందరికీ పంచితే ప్రతి ఒక్కరికి నాలుగు కిలోల చొప్పున బంగారం వస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: