బంగారం ధరలను ప్రభావితం చేసే 5 అంశాలు

Vimalatha
ఈ రోజు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 46,660కి, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 47,660కి చేరుకుంది. వెండి మాత్రం ఎలాంటి మార్పు లేకుండా నిన్నటి ధర లోనే కొనసాగింది. కేజీ వెండి ధర రూ. 63,800 వద్ద నిలకడగా ఉంది.
బంగారంపై పెట్టుబడి పెట్టడం ప్రారంభించే వారు భారతదేశంలో బంగారం ధరలను ప్రభావితం చేసే వివిధ అంశాలను ముందుగా అర్థం చేసుకోవాలి. వీటిలో అతి పెద్ద అంశం అంతర్జాతీయ బంగారం ధరలు. ఇవి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్లలో సాధారణ కొనుగోలు, అమ్మకం, డిమాండ్ మీద ఆధారపడి ఉంటాయి.
ఉదాహరణకు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. భారతీయ బంగారం ధరలు అంతర్జాతీయ ధరల వల్ల ప్రభావితం అవుతాయి. అవి రేట్లపై ప్రభావం చూపుతాయి.
బంగారం ధరలను ప్రభావితం చేసే మరో విషయం డాలర్‌తో రూపాయి కదలిక. డాలర్‌తో రూపాయి మారినప్పుడు, భారతదేశంలో బంగారం ధరలు మారతాయి. డాలర్‌తో రూపాయి మారకం తగ్గినప్పుడు బంగారం ధరలు చౌకగా మారతాయి.
బంగారం ధరపై ప్రభావం చూపే మరో అంశం స్థానిక పన్నులు, బంగారంపై దిగుమతి పన్నులు. అవి తగ్గినప్పుడు బంగారం ధరలు తగ్గుతాయి. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు ధరలను కూడా ప్రభావితం చేస్తాయని అర్థం చేసుకోవాలి. కానీ ఇవి దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయి.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకర్ల విధానాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఎందుకంటే ద్రవ్య సడలింపు ఉన్నప్పుడు బంగారం ధరలు ఎక్కువగా ఉంటాయి. కఠినతరం అయినప్పుడు అవి తగ్గుతాయి.

బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ అంశాలన్నీ జాగత్తగా గమనించాల్సి ఉంటుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: