మహిళలకు శుభవార్త... తగ్గిన బంగారం, వెండి ధరలు

Vimalatha
ఇది నిజంగా శుభవార్తే... గత వారం రోజుల నుంచి బంగారం ధరల పరుగులు తగ్గాయి. వరం రోజుల్లో రెండు రోజులు మాత్రమే స్థిరంగా ఉంది బంగారం. మరో నాలుగు రోజుల నుంచి బంగారం రోజూ ఎంతోకొంత తగ్గుతూనే ఉంది. గత వారం పెరిగిన ధరలు చూసి ఈ వారాంతానికి రూ.50 వేలకు పైబడుతుందని అంతా భావించారు. మరోవైపు వెండి ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గుతూ వస్తోంది. అయితే ఈ రోజు మాత్రం వెండి, బంగారం రెండూ తగ్గాయి. కేజీ వెండి ధర రూ.800 పడిపోయింది. తగ్గిన ధరతో కలిపి నేడు కేజీ వెండి ధర రూ.73,100కు చేరుకుంది. నిన్న ఇదే రూ.400 తగ్గిన వెండి ధర రూ.72,300గా ఉంది. మన రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాల్లో ఇదే ధర కొనసాగుతుంది. వేరే రాష్ట్రాల్లోని వెండి ధరల్లో మార్పు ఉండే అవకాశం ఉంది. ఇక బంగారం విషయానికొస్తే... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.100 తగ్గి రూ. 44,800కు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.100 తగ్గి రూ. 48,880కి చేరుకుంది.
హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,950
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,220
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,970
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,970
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,260
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,380

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: