షాక్ : భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు

Vimalatha
బంగారం ధరలు రానురానూ దారుణంగా పెరిగిపోతున్నాయి. ఈ రోజు పెరిగిన ధరలు చూస్తుంటే మరో రెండ్రోజుల్లో రూ.50 వేలను దాటిపోనుంది పసిడి. ఇప్పటికే బంగారం కొన్నవారికి ఇది పర్వాలేదు కానీ ఈ సమయంలో గోల్డ్ కొనాలనుకునే వారికి మాత్రం ఆందోళనకర విషయం. మరోవైపు వెండి కూడా ఏకంగా రూ.6000 పెరిగింది. గత రెండ్రోజులుగా పతనమైపోతున్న వెండి ధరలు మళ్ళీ అంతే వేగంగా పుంజుకుంటున్నాయి. ఈ రోజు కేజీ వెండి రూ.6000 పెరిగింది. దీంతో వెండి ధర రూ.73,200 ఉంది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ లలో కేజీ వెండి ధర రూ.73,200గా ఉంది. ఇక బంగారం విషయానికొస్తే... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.350 పెరిగి రూ.45,250కి చేరుకుంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.49,370కి చేరుకుంది. నేడు గరిష్టంగా బంగారం ధర రూ. 51,710గా నమోదైంది.

హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,370
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,400
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,710
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,370
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,250
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,370
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,380
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,380
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,620
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,770

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: