పెరిగిన పసిడి ధరలు.. పడి పోయిన వెండి..!!

Satvika
బంగారం కొనాలని అనుకునేవారికి చేదు వార్త.. పసిడి ధరలకు ఈరోజు రెక్కలు వచ్చాయి.. నిన్నటి వరకూ ఓ రకంగా ఉన్న ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరుగుదల కనిపిచింది.. దేశం లో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.. ఈరోజు ధరలు పరుగులు పెడుతున్నాయి. దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజు రోజుకు పెరుగుతూ, తగ్గు తూ వస్తున్న సంగతి తెలిసిందే.. గత 20 రోజుల నుంచి పసిడి ధరలు తగ్గుతూవస్తున్నాయి.. ఇక ఆదివారం దేశీయంగా బంగారం ధరపై స్వల్పంగా పెరిగింది.10 గ్రాముల బంగారం ధరపై రూ.200 వరకూ పెరిగింది.


హైదరాబాద్‌లో ఆదివారం మార్కెట్ లో బంగారం ధర పెరిగింది.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,100 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.48,100 ఉంది.. నిన్నటి ధర తో పోలిస్తే ఈరోజు స్వల్పంగా పెరిగింది. భారత్ లోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు భారీగా పడిపొయాయి. 400 మేర వెండి ధర పైకి కదిలింది.. దీంతో కేజీ వెండి ధర రూ.73,500 వద్ద కొనసాగుతోంది. 


మార్కెట్ పై కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటం తో ధరలు పెరుగుతూన్నాయని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు,కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, ఆభరణాలు మోడల్స్ అందుబాటులో లేకపోవడం మొదలగు అంశాలు బంగారం ధరల పై ప్రభావం చూపుతాయని తెలిపారు. బంగారాన్ని కొనాలనుకునే వాళ్ళు ఈరోజు రేట్ల ను తెలుసుకొని వెళ్లడం మంచిది.. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. ఆషాడం ,మరో వైపు పెళ్ళిళ్ళు, నగలను కొనెవారి సంఖ్య  పెరగడం తో ధరల పై నిలకడ లేదు. రేపు మాత్రం మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి.. ఈ నెల చివరి లో బంగారం భారీగా పడిపోవడం ఖాయమని నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: