పసిడి ధర జిగేల్.. తగ్గిన వెండి .. !!

Satvika
పసిడి ప్రియులకు భారీ షాక్.. ఈరోజు బంగారం ధరలు పైకి కదిలాయి.. గత వారం, పది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూవస్తున్నాయి.. దీంతో మార్కెట్ లో బంగారం కొనుగొల్లు పెరిగాయి. బంగారు దుకాణాలు జనాల తో కిక్కురిసి ఉన్నాయి. ఇప్పుడు మాత్రం వెల వెల బోతున్నాయి. ఈరోజు ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. విదేశీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.. పసిడి ధరలు పరుగులు పెడుతుంటే వెండి ధరలు మాత్రం కిందకు దిగి వస్తున్నాయి.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం మీద రూ. 220 పెరిగింది. ఈ మేరకు పసిడి రేటు రూ.48,110కు చేరింది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో పయనించింది. రూ.200 పెరుగుదలతో రూ.44,100కు చేరింది.బంగారం ధర పెరిగితే మాత్రం.. వెండి ధర తగ్గింది. నిన్న 73,100 ఉన్న వెండి, నేడు మార్కెట్ లో 100 రూపాయలు తగ్గగా 73,000 కు క్షీణించింది.
అదే విధంగా అంతర్జాతీయ మార్కెట్ లో పసిడి ధరలు ఈరోజు కూడా పరుగులు పెట్టాయి. బంగారం ధర ఔన్స్‌కు 1778 డాలర్లకు ఎగసింది.వెండి రేటు మాత్రం తగ్గింది. 25. 83 డాలర్లకు చేరింది. పసిడి ధరలు పెరగడానికి, తగ్గడానికి  ఎన్నో కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అసలే కరోనా వల్ల దేశ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. మరి రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూడాలి..

బంగారం గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్..
బంగారం ధరలు భారత దేశంలో పెరుగుతున్నాయి. ఎందుకంటే మనదేశంలో పసిడి నిల్వలు తక్కువగా ఉన్నాయి. అందుకే దుబాయి లాంటి దేశాల నుంచి మనదేశానికి  అక్రమంగా రవాణా చేస్తున్నారు. మేలిమి బంగారం తో పాటుగా రేటు కూడా తక్కువే.. దుబాయ్‌లో తులానికి రూ.4 వేల నుంచి రూ.5వేల వరకు తక్కువగా ఉంటుంది. ఈ లెక్కన కిలో బంగారం ఇండియాకు చేరవేస్తే రూ.5 లక్షల వరకు గిట్టుబాటు అవుతుంది. ఈ సంపాదనకు ఆశపడ్డ స్మగ్లర్లు అమాయకులకు డబ్బు ఆశ చూపిస్తూ అనవసరపు కేసులలో ఇరికిస్తుంటారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: