స్వల్పంగా పెరిగిన బంగారం.. దిగొచ్చిన వెండి.. !!

Satvika
బంగారం కొనాలని అనుకునే వారికి ఝలక్.. ఈరోజు మార్కెట్ లో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి.. నిన్న మార్కెట్ లో ఓ మాదిరిగా ఉన్న ధరలు ఒక్కసారికి పైకి కదిలాయి.దేశ వ్యాప్తంగా బంగారం ధరల్లో రోజురోజుకు మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గత రెండు నెలల కిందట తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు మే నెల నుంచి పరుగులు పెట్టింది. అయితే ఆదివారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. అత్యధికంగా హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధరపై 100 వరకు పెరిగింది.



అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ధరలు పెరిగినట్లు తెలుస్తున్నది.. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది.ఒకవైపు బంగారం ధరలు పెరుగుతుండగా వెండి ధరలు మాత్రం తగ్గాయి.దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 71,600 ఉండగా, చెన్నైలో రూ.76,200 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ. 71,600 ఉండగా, కోల్‌కతాలో రూ. 71,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ. 71,600 ఉండగా, కేరళలో రూ. 71,600 ఉంది. వెండి వస్తువులకు డిమాండ్ తగ్గడంతో ధర తగ్గినట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.



దేశంలో చోటు చేసుకుంటున్న పలు ఆర్థిక, పలు పరిణామాల వల్ల బంగారం, వెండి ధరల్లో కీలక మార్పులు జరుగుతుంటాయి. పసిడి ధరలు పెరగడం పై ఎన్నో కారణాలున్నాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. మరి రేపు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా వుంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: