వావ్.. భారీగా పడిపోయిన వెండి.. బంగారం ధర ఇలా..

Satvika
ఈరోజు మగువల కలలకు రెక్కలు వచ్చాయనే చెప్పాలి.. ఎప్పుడెప్పుడా అని బంగారం ,వెండి కోనాలనే వారి కల నేటితో తీరనుంది. ఎందుకంటే బంగారం, వెండి ధరలు అనుకున్న విధంగా కిందకు దిగి వస్తున్నాయి..గత కొన్ని రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. మన మార్కెట్ లో ధరల పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి..పసిడి రేటులో ఎలాంటి మార్పు లేదు. స్థిరంగానే ఉంది. బంగారం ధర నిలకడగానే కొనసాగితే.. వెండి రేటు మాత్రం భారీగా పడిపోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పెరిగాయి..

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధర నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంలో ఎలాంటి మార్పు లేదు. రూ.47,780 వద్దనే నిలకడగా ఉంది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.43,800 వద్ద స్థిరంగా ఉంది... ఇక వెండి విషయానికొస్తే..బంగారం ధర స్థిరంగానే కొనసాగుతున్నా వెండి ధరలు మాత్రం భారీగా కిందకు దిగి వచ్చాయి.. నిన్నటి రేట్లు తో పోలిస్తే ఈ రోజు పూర్తిగా కిందకు పడిపోయాయి.

వెండి ధర కేజీకి రూ.1200 తగ్గుదలతో రూ.72,800కు పతనమైంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పైకి కదిలింది. బంగారం ధర ఔన్స్‌కు 0.01 శాతం పెరుగుదలతో 1767 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 0.23 శాతం పెరుగుదలతో 25.93 డాలర్లకు చేరింది.. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండ్ ఈల్డ్ వంటి వి బంగారం ధరల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి..మరి మార్కెట్ లో రేపు ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: