ఈరోజు బంగారు ధర స్థిరం.. పడిపోయిన వెండి..!!

Satvika
పసిడి ప్రియులకు శుభవార్త.. గత రెండు రోజుల నుంచి ధరల్లో స్వల్ప మార్పులు ఉన్న సంగతి తెలిసిందే.. అయితే, నేటి మార్కెట్ లో మాత్రం ధరలు స్థిరంగా కొనసాగుతోంది. బంగారం ధర పెరగకుండా మళ్లీ నిలకడగానే ఉంది. ఈరోజు కూడా బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. బంగారం ధర నిలకడగా ఉండటం ఇది వరుసగా రెండో రోజు కావడం గమనార్హం. బంగారం ధర స్థిరంగా ఉంటే.. వెండి రేటు మాత్రం పడిపోయింది.. వెండి ధర తగ్గి, బంగారం ధరలు స్థిరంగా ఉండటం ఇదే మొదటి సారి అని నిపుణులు అంటున్నారు.


మరోవైపు అంతర్జాతీయ మార్కెట్‌ లో బంగారం ధర పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం నిలాడగానే ఉంది. హైదరాబాద్ మార్కెట్‌ లో మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. నిలకడగానే ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,090 వద్దనే కొనసాగుతోంది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. ధర రూ.42,250 వద్ద ఉంది..


బంగారం ధర నిలకడగా కొనసాగితే.. వెండి రేటు మాత్రం పడిపోయింది. వెండి ధర రూ.410 దిగొచ్చింది. దీంతో కేజీ వెండి ధర రూ.69,300 కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పూర్తిగా తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ధర ఔన్స్‌కు 0.30 శాతం పెరుగుదలతో 1734 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారి లో నడిచింది. ఔన్స్‌కు 0.95 శాతం పెరుగుదలతో 25.01 డాలర్లకు చేరింది. బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి.   తెలుగు సంవత్స రాది ఉగాదికి బంగారం పూర్తిగా తగ్గిపోతుందని నిపుణులు అంటున్నారు.. మరి ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: