బంగారం కొనాలనుకునే వారికి అదిరిపోయే గుడ్ న్యూస్...!!

Satvika
బంగారం కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు కిందకు దిగి వచ్చాయి. నిన్నటి వరకు పైకి ఎగసిన బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి.. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పైకి కదిలిన కూడా హైదరాబాద్ మార్కెట్ లో మాత్రం రేట్లు ఒక్కసారిగా పడిపోయాయి. నిన్న భారీగా పెరిగిన ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఈ వార్త నిజంగానే పసిడి ప్రియులు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. దీంతో మార్కెట్ లో కొనుగోళ్లు కూడా భారీగా పెరిగాయి.



నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం రేట్ల విషయానికొస్తే..10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 45,500 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 540 తగ్గి రూ. 49,640 కి చేరింది. బంగారం ధరల తో పాటు వెండి ధర భారీగా పడిపోయింది. వెండి ధర 900 తగ్గడంతో రూ. 69,700 కు పడిపోయింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.



అంతర్జాతీయ మార్క్ మార్కెట్లో బంగారం ధరలు నిన్న భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.. బంగారం ధర ఔన్స్‌కు 0.26 శాతం పెరుగుదలతో 1883 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.08 శాతం పెరుగుదలతో 25.94 డాలర్లకు పెరిగింది. బంగారం ధరల పై ప్రభావం చూపే అంశాలను చూస్తే లెక్క లేనన్ని కనిపిస్తాయి... ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, జువెలరీ మార్కెట్ వంటి అంశాలు బంగారం రేట్ల పై ప్రభావం చూపిస్తున్నాయి. ఈ రోజు ధరలు కొనసాగుతాయా లేక మారతాయా అనేది చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: