పసిడి ప్రియులకు అదిరిపోయే న్యూస్.. బంగారం, వెండి ధరలు ఇలా..!!

Satvika
నిన్న , మొన్నటి నుంచి బంగారం ధరలు కిందకు దిగి వస్తున్నాయి. ఈరోజు కూడా పసిడి ధరలకు మార్కెట్ లో  బ్రేకులు పడ్డాయి.. గత వారం నుంచి రేట్లు కిందకు వస్తున్నాయి. పండగ సీజన్ లలో గోల్డ్ కు పూర్తిగా గిరాకీ తగ్గింది.. ఇకపోతే ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పడిపోయాయి. కార్తీక మాసాల్లో ఇది శుభవార్త అనే చెప్పాలి.. ప్రస్తుతం భారతీయ మార్కెట్ లో కొనసాగుతున్న రేట్లు జనాలకు ఊరటను కలిగిస్తున్నాయి..బంగారం ధర దిగిరావడం పసిడి కొనుగోలుదారులకు సంతోషాన్ని కలిగిస్తోంది..  అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు పడిపోవడంతో దేశీ మార్కెట్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగిందని బులియన్ మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..

ఇక ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ధరల విషయానికొస్తే..విదేశీ మార్కెట్ లో రేట్లు పెరిగిన కూడా ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో రేట్లు పూర్తిగా కిందకు వచ్చాయి.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 దిగొచ్చింది. రూ.50,070కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.400 క్షీణతతో రూ.45,900కు తగ్గింది..బంగారం ధరలు దారిలోనే వెండి ధరలు కూడా ఆధారపడి ఉన్నాయి..

ఇకపోతే వెండి ధర కూడా జనాలకు ఊరటను కలిగిస్తుంది. ఏకంగా రూ.1,200 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.66,800కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ భారీగా తగ్గడంతో వెండి ధర పూర్తిగా తగ్గింది..అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడిపోయింది.ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 1840 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.60 శాతం పెరుగుదలతో 24.13 డాలర్లకు క్షీణించింది. జనవరిలో బంగారం ధరలు భారీగా తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. మరి ఎలా ఉంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: