పసిడి ధరలు గత మూడు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే.. గత వారం రోజులుగా ఈ ధరలు నిలకడగా లేవు. ఒకరోజు ఉన్న ధర మరొక రోజుకు ఉండటం లేదు. పసిడి ప్రియులకు షాక్ ఇచ్చేలా నిన్న పెరిగిన బంగారం ధరలు ఈరోజు మాత్రం భారీగా పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ప్రభావమే దేశీయ మార్కెట్ లో రేట్లు తగ్గడానికి కారణం అని నిపుణులు అంటున్నారు. ఈరోజు రేట్లు ఊరట కలిగిస్తుండటంతో ఆభరణాల కొనుగోల్లు పెరిగాయి.
హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 దిగొచ్చింది. రూ.50,500కు క్షీణించింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.300 క్షీణతతో రూ. 46,300కు తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. వెండి ధర భారీగానే తగ్గింది. ఇక వెండి విషయానికొస్తే.. కిలో వెండి భారీ తగ్గింది.ఏకంగా రూ.1,500 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.68,000కు క్షీణించింది.
వెండికి డిమాండ్ రోజుకో విధంగా మారుతుంది.. కొనుగోల్లు ఎక్కువగా ఉన్నప్పుడు ధర ఆకాశానికి నిచ్చెనలు వేస్తుంది.. ప్రస్తుతం పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పూర్తిగా తగ్గడంతో వెండి ధరలు నేలచూపులు చూస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో ఈ ధరలను చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.07 శాతం పెరుగుదలతో 1839 డాలర్లకు చేరింది. పసిడి ధరల దారిలోనే వెండి కూడా పయనించింది.. వెండి ధర ఔన్స్ కు 0.10 శాతం పెరుగుదలతో 24.01 డాలర్లకు చేరింది.. రోజు రోజుకు షాక్ ఇస్తున్న ఈ ధరలు రేపటికి ఎలా ఉంటాయో చూడాలి.. ఈరోజు మాత్రం దుకాణాల వల్ల జనాలు బారులు తీరారు..