బంగారం ధరలు పైపైకి.. వెండి ధరలు అదే దారిలో..!!

Satvika
గత కొద్ది రోజులుగా బంగారం ధరలు పూర్తిగా తగ్గాయి. నిన్నటి నుంచి ధరలు మండిపోతున్నాయి..మొన్నటి వరకు కొనుగోలు పెరిగిన వంగం రేట్లు పెరిగిన కారణంగా బంగారు దుకాణాలు వెల వెల బోతున్నాయి.ఆ మాటకొస్తే  కొందరు బంగారు ప్రియులు మాత్రం బంగారాన్ని ఎగబడి కొంటున్నారు.. నిన్నటి తో పోలిస్తే ఈరోజు రేట్లు మరింత పెరిగారు. విదేశీ మార్కెట్ లో రేట్లు తగ్గినా కూడా భారత దేశంలో మాత్రం బంగారం ధరలు తారా స్థాయికి చేరుకున్నారు. వెండి కి కూడా అంతే గిరాకీ ఉండటంతో వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి..

హైదరాబాద్ మార్కెట్ లో ఈరోజు రేట్లు చూస్తే..హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 పెరుగుదలతో రూ.51,930కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.10 పైకి కదిలింది. దీంతో ధర రూ.47,610కు ఎగసింది.నిన్న పరుగులు పెట్టిన బంగారం ధర ఈరోజు కూడా స్వల్పంగా పైకి కదిలింది. అంటే పసిడి ధర వరుసగా రెండో రోజు కూడా పెరిగింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది.

పసిడి రేట్ల పై నే వెండి ధరలు కూడా కొనసాగుతున్నాయి..గత నాలుగు రోజులుగా పెరుగుతూ వస్తున్న వెండి ధర నేడు ఇంకాస్త పెరిగింది. వెండి కిలో ధర రూ.300 పెరిగింది. దీంతో వెండి ధర రూ.66,600కు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పెరగడంతో వస్తువుల, తయారీ, నాణేల తయారీ మొదలగు వెండి వస్తువులు డిమాండ్ పెరగడంతో వెండి ధరలు ఊపందుకుంటున్నాయి అని మార్కెట్ నిపుణులు అంటున్నారు.. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో వీటి ధర విషయానికొస్తే..బంగారం ధర ఔన్స్‌కు 0.24 శాతం తగ్గుదలతో 1942 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.44 క్షీణతతో పెరుగుదలతో 25.07 డాలర్లకు దిగొచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: