మరోసారి భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు...!

Suma Kallamadi
ప్రపంచ దేశాల్లో బంగారం ఇష్టపడే వారిలో భారతీయులు కూడా ముందు వరుసలో ఉంటారు. రాజుల కాలం నాటి నుండి బంగారు ఆభరణాలకు ఉన్న ప్రాముఖ్యత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ శుభ కార్యక్రమం జరిగినా అందులో బంగారం ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. అలాగే వ్యాపారస్తులు కూడా వారి సంపదను స్థిరాస్తులు, అలాగే బంగారం పై ఎక్కువగా మొగ్గుచూపుతారు. ఇక ఇదే నేపథ్యంలో 2020 సంవత్సరం మొదలైనప్పుడు నుండి బంగారం ధర అంతకంతకు పెరుగుతూ వెళుతుంది. బంగారంతో పాటు వెండి కూడా అదే దారిలో నడుస్తుంది. ప్రస్తుతం బంగారం వెండి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో బీద, మధ్యతరగతి ప్రజలు వాటిని కొనాలంటే ఆషామాషీ వ్యవహారం కాదు. కేవలం ధనికులు మాత్రమే ఉపయోగించే లిస్టులోకి వెళ్తున్నాయి.


ఇక తాజాగా బంగారం వెండి ధరలు చూస్తే తాజాగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం విలువ 220 రూపాయలు పెరిగి రూ. 55,820 వద్ద ముగిసింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 220 రూపాయలు పెరిగి రూ. 51250 వద్ద ముగిసింది. ఈ ఏడాదిలోనే బంగారం ధర ఏకంగా 20 శాతం మేర పెరిగింది.

ఇక మరోవైపు బంగారం ధర తో పాటు వెండి ధర కూడా ఆకాశాన్ని అంటుతుంది. ధరలు పెరగడంలో బంగారంతో పోలిస్తే వెండి కూడా దూసుకెళుతోంది. తాజాగా వెండి ధర కేజీ 2000 రూపాయలు పెరిగి 65 వేలకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే రెండు వేల రూపాయలు పెరిగి రూ. 65000 వద్ద ముగిసింది. ఈ సంవత్సరం మొదట్లో 40 వేల పైన ఉన్న వెండి ప్రస్తుతం 65 వేలకు చేరుకుంది. ఒకవైపు బంగారం, వెండి లకు ఎక్కువ డిమాండ్ లేకపోయినప్పటికీ ధరలు మాత్రం ఆకాశాన్ని చేరుకుంటున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: