బంగారం: భారీగా పెరిగిన బంగారం ధర.. వెండి కూడా అదే భాటలో ?

Durga Writes

బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజుకు భారీగా పెరుగుతున్న ఈ బంగారం ధరలను ఎవరు ఆపలేరు.. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు అతి దారుణంగా కుప్పకూలుతున్నాయి.. దీంతో ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు.. ఇంకేముంది హద్దు అదుపు లేకుండా బంగారం ధర పెరిగిపోతుంది.. 

 

అసలు సామాన్యులకు అందనంత రేంజ్ లో బంగారం ధరలు కొనసాగుతున్నాయి.. అయితే ఈ బంగారం ధరలు తగ్గాలి అంటే సామాన్యులు బంగారాన్ని బ్యాన్ చెయ్యాలి.. లేదు అంటే ఇలాగే అద్దు అదుపు లేకుండా పెరిగిపోతుంది.. ఇంకా పోతే గత సంవత్సరం ఈ సమయానికి బంగారం ధర 32వేలు ఉండేది.. ఇప్పుడు 50 వేలుకు వెళ్ళింది. అంటే ఒక సంవత్సరంలో ఏకంగా 19 వేలు పెరిగింది. 

 

ఎన్నడూ ఇంత పెరగలేదు.. ఏకంగా 50 వేలు అంటే మాములు విషయమా? బంగారం ధరలు ఇంత పెరిగితే ఇంకా మనం ఎలా కొనేది.. సరే లెండి ఈరోజు బంగారం ధరలు ఎంత పెరిగాయో చూద్దాం ఇక్కడ.. నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయ్. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయిల పెరుగుదలతో 50,580 రూపాయలకు చేరింది. 

 

అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 200 రూపాయిల పెరుగుదలతో 46,290 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర మాత్రం గమణియంగా తగ్గింది.. దీంతో నేడు కేజీ వెండి ధర 130 రూపాయిల తగ్గుదలతో 48,880 రూపాయలకు చేరింది. ఇలా నేడు హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి.                         

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: