బంగారం: స్వల్పంగా పెరిగిన బంగారం ధర! ఎంత పెరిగింది అంటే?

Durga Writes

గత మూడు రోజుల నుండి భారీగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు మళ్లి దారుణంగా పెరిగాయి.. వారం రోజులు పెరిగితే రెండు రోజులు బంగారం ధరలు తగ్గుతున్నాయి. అయితే నిజానికి ఈ రెండు రోజుల్లో బంగారం ధరలు ఎంత తగ్గినప్పటికీ మరుసటి రోజు బంగారం ధర రెట్టింపు పెరుగుతుంది. 

 

ఇంకా ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాయి. కరోనా వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడటం.. అవి దారుణంగా కుప్పకూలడం.. ఇంకా ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం వల్లే బంగారం ధరలు పెరిగాయి.. ఇలా రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. 

 

ఇప్పటికే ఈ ఒక్క సంవత్సరంలోనే ఏకంగా 16 వేలు పెరిగింది. ఈ కరోనా వైరస్ వచ్చిన రెండు నెలలకే బంగారం ధరలు దారుణంగా పెరిగాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు బంగారం, వెండి ధర ఇలా కొనసాగుతుంది.. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయ్. 

 

పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 70 రూపాయిల పెరుగుదలతో 48,420 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 70 రూపాయిల పెరుగుదలతో 44,350 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 30 రూపాయిల పెరుగుదలతో 47,440 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 47 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతుంది. మరి ఏ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: