బంగారం: మళ్లీ భారీగా పడిపోయిన బంగారం ధర!
బంగారం ధరలు ఎలా ఉంటున్నాయో అసలు అర్ధం కావడం లేదు. ఒకరోజు భారీగా తగ్గితే మరో రోజు భారీగా పెరుగుతున్నాయి. ఇంకా ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఆకాశాన్ని తాకిన బంగారం ధర ఇప్పుడు వారానికి రెండు సార్లు తగ్గుతూ వస్తుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే మొన్న భారీగా తగ్గిన బంగారం ధర నిన్న స్వల్పంగా పెరిగింది. అయితే ఈరోజు మళ్లీ పడిపోయింది.
ఇంకా నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 240 రూపాయిల తగ్గుదలతో 43,870 రూపాయలకు చేరింది. ఇంకా ఇదే నేపథ్యంలో పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 230 రూపాయిల తగ్గుదలతో 39,890 రూపాయలకు చేరింది. ఇలా బంగారం ధరలు భారీగా తగ్గగా వెండి ధర భారీగా క్షిణించింది.
దీంతో నేడు కేజీ వెండి ధర 380 రూపాయిల తగ్గుదలతో 40,640 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు భారీగా కొనసాగుతున్నాయి. అయితే ఇక్కడ అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే? బంగారం ధరలు ఎంత తగ్గినప్పటికీ లాక్ డౌన్ పూర్తయ్యేవరుకు బయటకు వెళ్ళడానికి కుదరదు. కాబట్టి బంగారం ధరలు ఎంత తగ్గిన సైలెంట్ గా ఇంట్లోనే ఉండాలి.