నేటి నుంచి 42 మెగా ఉద్యోగ మేళాలు...!!

Shyam Rao

ట్రేడ్ హైదరాబాద్.కాం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 11వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 42 మెగా ఉద్యోగ మేళాలు నిర్వహించనున్నట్లు నిర్వహకులు వెంకట్ బులెమోని ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 180 ప్రైవేటు కంపెనీల్లో పది వేల ఉద్యోగావకాశాలు లభించనున్నట్లు చెప్పారు. ఈ ట్రేడ్ మేళాలు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, నల్గొండ, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో జరుగుతాయని పేర్కొన్నారు.



అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం, తూర్పు గోదావరి, ప్రకాశం, కర్నూలు, ఒంగోలు, కడప, తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళం, అనంతపురంలో జరుగుతాయన్నారు. ఫిబ్రవరి 11న కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడలో ప్రారంభమవుతుందని, జులై 15న తిరుపతిలో జరిగే మెగా మేళాతో ముగుస్తుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: