నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 11000వేల అంగన్వాడీ పోస్టులు ..!

frame నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 11000వేల అంగన్వాడీ పోస్టులు ..!

Divya
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పథకాల విషయంలో,నిరుద్యోగులకు ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామంటూ చెప్పడం ఉందే తప్ప చేసేలా కనిపించలేదు. ఇటువంటి సమయంలోనే ఇప్పుడు తాజాగా 11 అంగన్వాడి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయబోతున్నామంటూ తెలుపుతోంది తెలంగాణ ప్రభుత్వం. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి అయిన మంత్రి సీతక్క ఈ విషయాన్ని తెలియజేశారు. ఇందుకు సంబంధించి విధివిధానాలను కూడా తెలియజేస్తు ఒక నోటిఫికేషన్ ఇస్తామంటూ తెలియజేసింది మంత్రి సీతక్క. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 35, అంగన్వాడి కేంద్రాలు ఉన్నాయని 15 వేల కేంద్రాలలో నర్సరీ పాఠశాలలకు సంబంధించిన వాటిని ఏర్పాటు చేస్తున్నామని ఈ పాఠశాలల కోసం అంగన్వాడి కార్యకర్తలకు ఇంగ్లీష్ బోధన ఇతర వాటిపైన కూడా శిక్షణ ఇస్తున్నామంటూ తెలియజేసింది.

ఇక అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ కు అర్హతలు ఇంటర్ ఉండాలని.. గతంలో టీచర్ పోస్టులకు పదవ తరగతి మాత్రమే ఉండేది అంటూ తెలిపారు.

ఇక ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి 65 ఏళ్లు దాటిన తర్వాత వారి సేవలను నిలిపివేయబడుతుందట.

తెలంగాణ అంగన్వాడి ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు తర్వాత 2 లక్షల రూపాయలు ఇస్తారని అలాగే ఆయాలకు లక్ష రూపాయలు ఇస్తామంటూ మంత్రి సీతక్క తెలియజేసింది ప్లే స్కూల్ లకు ప్రాథమిక పాఠశాలలకు ప్రాంగణంలోని వీటిని నిర్వహిస్తామంటూ తెలియజేసింది. దీని ద్వారా పిల్లలు నర్సరీని పూర్తి చేసిన వెంటనే ఆ స్కూలులోకి వెళ్తారని కూడా తెలియజేసింది. ప్రస్తుతం తెలంగాణ అంగన్వాడి కేంద్రాలకు సంబంధించి ఫర్నిచర్స్ మరియు అవసరమైన సామాగ్రిని కూడా సరఫరా చేస్తున్నామంటూ తెలిపింది మంత్రి సీతక్క.. మరి త్వరలోనే అంగన్వాడి పోస్టులను సైతం భర్తీ చేస్తామంటూ తెలియజేయడంతో నిరుద్యోగులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: