శుభవార్త: BELలో ఉద్యోగాలు!

Purushottham Vinay
ఇక భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నిరుద్యోగులకు మంచి శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసింది.మొత్తం 60 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కూడా జులై 19 వ తేదీన ప్రారంభమైంది. ఇంకా ఈ దరఖాస్తుకు వచ్చే నెల 3 వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించింది. అర్హత ఇంకా అలాగే ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అధికారిక వెబ్ సైట్ bel-india.inలో ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ట్రైని ఇంజనీర్ ఇంకా అలాగే ప్రాజెక్ట్ ఇంజనీర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

విద్యార్హతల వివరాల విషయానికి వస్తే..మొత్తం నాలుగేళ్ల బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా అలాగే అభ్యర్థులు AICTE గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సిటీ నుంచి ఈ డిగ్రీ పొంది ఉండాలి. ఓబీసీ/ఈడబ్ల్యూఎస్/జనరల్ అభ్యర్థులు ఖచ్చితంగా 55 శాతం మార్కులతో పాసై ఉండాలి. ఇతర అభ్యర్థులు అయితే పాసైతే సరిపోతుంది. వీటికి ఎంపికైన అభ్యర్థులు సంస్థకు చెందిన బెంగళూరు కాంప్లెక్స్ లో పని చేయాల్సి ఉంటుంది. ఇక ట్రైనీ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేసుకునే వారి వయస్సు ఆగస్టు 1 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. ప్రాజెక్ట్ ఇంజనీర్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న వారి వయస్సు వచ్చేసి 32 ఏళ్లలోపు ఉండాలి.

ఇక ఈ పోస్టులకు ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు మొదటగా బీఈఎల్ అధికారిక వెబ్ సైట్ అయిన www.bel-india.inను ఓపెన్ చేయాలి.
Step 2: తరువాత హోం పేజీలో Career ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
Step 3: ఆ తర్వాత నోటిఫికేషన్ ను పూర్తిగా చదివిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను నింపాలి.
Step 4: ఇంకా కావాల్సిన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
Step 5: ఇక దరఖాస్తు ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BEL

సంబంధిత వార్తలు: