నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. SSCలో భారీగా జాబ్స్!

Purushottham Vinay
ఇక నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 42,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు SSC ప్రకటించింది.అలాగే మరో నెలరోజుల్లో 15,247 పోస్టులకు నియామక పత్రాలు అందజేయనున్నట్లు కూడా కమిషన్ వెల్లడించడం జరిగింది. ఇక ఇదే విషయాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) సోషల్ మీడియా ద్వారా ఆదివారం నాడు ప్రకటించింది. ఇక సైన్యంలో నియామకాల కోసం చేపట్టిన 'అగ్నిపథ్' ప్రాజెక్టుపై నిరసనలు ఇప్పటికి కూడా ఎక్కువగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే 2022 వ సంవత్సరం చివరి నాటికి భారీగా పోస్టుల రిక్రూట్‌మెంట్‌ను పూర్తి చేస్తామని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వార్త రావడం గమనార్హం.అలాగే వచ్చే ఏడాదిన్నర కాలంలో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి కొత్తగా ఈ ప్రకటన అనేది వెలువడింది.ఇక దీనికి సంబంధించిన PIB పోస్ట్‌లో వివరాలు ఇలా ఉన్నాయి. '2022 డిసెంబర్ నెల లోపు 42,000 పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ప్రక్రియ అనేది పూర్తవుతుంది. అలాగే దీంతోపాటు 67,768 ఖాళీలను వీలైనంత త్వరగా భర్తీ చేసేందుకు పరీక్షలు కూడా నిర్వహించాలని SSC ప్లాన్ చేస్తోంది.' అని పేర్కొంది.


అలాగే మరికొన్ని నెలల్లో 15,247 పోస్టులకు నియామక పత్రాలు జారీ చేసే విషయంపై కూడా కమిషన్ స్పందిస్తూ..ఇక వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు వీటిని జారీ చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించి ఇంకా పెద్దగా సమాచారం అనేది వెలువడనప్పటికీ, ఈ వార్త కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు భారీ ఊరటనిస్తుంది.ఇక అలాగే మరోవైపు, అగ్నిపథ్ మిలటరీ రిక్రూట్‌మెంట్ స్కీమ్ కింద సైనికులను చేర్చుకునేందుకు కూడా ఆర్మీ సోమవారం నాడు నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది. కొత్త మోడల్‌లో ఉద్యోగాలను కోరుకునే వారందరికీ కూడా ఫోర్స్ రిక్రూట్‌మెంట్ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆర్మీ తెలిపింది. ఇక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అనేది జులై నెల నుంచి ప్రారంభమవుతుందని కూడా పేర్కొంది. ఇక ఇండియన్ ఆర్మీలో 'అగ్నివీర్స్' స్పెషల్ ర్యాంక్‌ను ఏర్పాటు చేస్తామని ఇంకా ఇది ప్రస్తుతం ఉన్న ఇతర ర్యాంక్‌ల కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుందని సైన్యం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

SSC

సంబంధిత వార్తలు: